Bigg Boss 5 : తండ్రి లేని కూతురని దగ్గరై అడ్వాంటేజ్‌ తీసుకోలేదని మీ అమ్మకు చెప్పు

సిరి వచ్చి మాట్లాడగా షన్ను దూరంగానే కూర్చొని ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా ఉందామని, ఇంట్లో వాళ్లను బాధపెట్టొద్దని సిరితో చెప్పాడు. తండ్రి లేని కూతురని నీకు దగ్గరై అడ్వాంటేజ్‌......

Bigg Boss 5 : తండ్రి లేని కూతురని దగ్గరై అడ్వాంటేజ్‌ తీసుకోలేదని మీ అమ్మకు చెప్పు

Shannusiri

Bigg Boss 5 :  గత రెండు రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ ఎపిసోడ్ నడుస్తుంది. హౌస్ లోని కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు రావడంతో అంతా ఎమోషనల్ అయ్యారు. కొంతమంది కంటెస్టెంట్స్ ఇంటి సభ్యులు మొన్నటి ఎపిసోడ్ లో రాగా, నిన్నటి ఎపిసోడ్ లో కొంతమంది వచ్చారు. అయితే మొన్నటి ఎపిసోడ్ లో సిరి తల్లి శ్రీదేవి హౌస్ లోకి వచ్చింది.

Bigg Boss 5 : తల్లిని దీప్తి సునైనా గురించి మరీ మరీ అడిగిన షణ్ను

ఆమె రావడంతోనే సిరితో షణ్ముఖ్‌ను నువ్వు హగ్‌ చేసుకోవడం నచ్చలేదని అందరి ముందు చెప్పేసింది. తండ్రి లేని పిల్ల కదా.. షణ్ముఖ్‌ తండ్రిగా, అన్నగా అన్ని రకాలుగా సాయం చేస్తూ దగ్గరవుతుండటం నాకు నచ్చలేదు. దగ్గరవడం మంచిదే కానీ హగ్గులు నచ్చట్లేదని చెప్పడంతో షన్ను షాక్ అయ్యాడు. సిరి ఆ సమయానికి టాపిక్‌ డైవర్ట్‌ చేసినా షన్ను దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చున్నాడు. అయితే ఆలా ఎందుకు చెప్పావు అని సిరి వాళ్ళ అమ్మతో మాట్లాడింది. తల్లిగా అనిపించింది, చెప్పవలసిన బాధ్యత నాకుంది అందుకే చెప్పను అని సిరి తల్లి శ్రీదేవి చెప్పింది.

Akhanda : ‘అఖండ’ వేదికపై ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్

ఇక హగ్గులు ఇచ్చుకోవడం నచ్చలేదని సిరి తల్లి చెప్పిన మాటలకు షణ్ను బాగా హర్టయ్యాడు. సిరి తల్లి వెళ్లిపోయాక సిరి వచ్చి షణ్ముఖ్ ని హగ్‌ చేసుకుని ఏడవగా షణ్ను ఆమెను ఇదివరకులాగా హగ్ చేసుకోలేకపోయాడు. నా గేమ్‌ కూడా వదిలేసి సిరికి ఇంత సపోర్ట్‌ చేస్తే ఆమె తల్లితో ఇలా మాట పడాల్సి వచ్చిందని ఫీలయ్యాడు. అలా హగ్గులు నచ్చలేదని ఆమె తల్లి చెప్పినప్పుడు సిరి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఒంటరిగా కూర్చుని ఏడ్చాడు. ఈ హౌస్‌లో ఉండేందుకు తనకు అర్హత లేదని, ఇంకా ఎందుకున్నానో అర్థం కావట్లేదని తనలో తానే బాధపడుతూ కూర్చున్నాడు షణ్ముఖ్.

Chiranjeevi : చిరంజీవి ట్వీట్‌పై పేర్ని నాని.. బిజీగా ఉన్నాం.. తర్వాత చూద్దాం

ఆ తర్వాత సిరి వచ్చి మాట్లాడగా షన్ను దూరంగానే కూర్చొని ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా ఉందామని, ఇంట్లో వాళ్లను బాధపెట్టొద్దని సిరితో చెప్పాడు. తండ్రి లేని కూతురని నీకు దగ్గరై అడ్వాంటేజ్‌ తీసుకోలేదని, నువ్వు బయటకి వెళ్ళాక ఈ మాట మీ అమ్మకు చెప్పని సిరితో అన్నాడు. ఈ మాటకి సిరి బాధపడింది. ఈ ఎపిసోడ్ తో వీరిద్దరి మధ్య దూరం పెరుగుతుంది అని భావిస్తున్నారు ప్రేక్షకులు.