Adipurush: హిందీలో ప్రభాస్ కోసం బాహుబలి సెంటిమెంట్ రిపీట్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ నుండి ఎట్టకేలకు టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు హిందీలోనూ భారీ హైప్ క్రియేట్ అయ్యింది. హిందీలో ప్రభాస్ పాత్రకు వాయిస్ ఇచ్చింది ఎవరా అని బాలీవుడ్ జనాలు తెగ వెతికేస్తున్నారు.

Adipurush: హిందీలో ప్రభాస్ కోసం బాహుబలి సెంటిమెంట్ రిపీట్!

Sharad Kelkar Voice For Prabhas In Adipurush Hindi Version

Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ నుండి ఎట్టకేలకు టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అయోధ్య నగరంలో ఈ చిత్ర టీజర్‌ను అంగరంగ వైభవంగా చిత్ర యూనిట్ లాంచ్ చేసింది. ఇక రాముడి పాత్రలో ప్రభాస్ లుక్ అదిరిపోవడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తున్నారు.

Adipurush Teaser: మోస్ట్ అవైటెడ్ ‘ఆదిపురుష్’ టీజర్ విడుదల.. ఫ్యాన్స్‌కి విజువల్ ట్రీట్

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాకు హిందీలోనూ భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కాగా హిందీలో ఆదిపురుష్ టీజర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక ఆదిపురుష్ టీజర్‌ను గమనిస్తే.. హిందీలో ప్రభాస్ పాత్రకు వాయిస్ ఇచ్చింది ఎవరా అని బాలీవుడ్ జనాలు తెగ వెతికేస్తున్నారు. అయితే గతంలో బాహుబలి హిందీ వర్షన్‌లో ప్రభాస్ పాత్రకు వాయిస్ ఇచ్చిన నటుడు శరద్ కేల్కర్ మరోసారి ప్రభాస్‌కు ‘ఆదిపురుష్’లోనూ వాయిస్ ఇచ్చాడు.

Adipurush: ఆదిపురుష్‌తో పోటీకి సై అంటోన్న వారసుడు..?

శరద్ కేల్కర్ బాహుబలిలో ప్రభాస్‌కు డబ్బింగ్ చెప్పిన విధానం అద్భుతంగా ఉండటంతో, ఆ సినిమా ప్రభాస్‌ను నార్త్ ఆడియెన్స్‌కు బాగా దగ్గర చేసింది. దీంతో ఇప్పుడు మరోసారి బాహుబలి సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ, ఆదిపురుష్‌లోనూ శరద్ కేల్కర్‌తోనే డబ్బింగ్ చెప్పించారు చిత్ర యూనిట్. ఇక జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఆదిపురుష్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాలో లంకేశ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్, సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.