Sharan : బెల్లంకొండ సురేష్ నుండి నా డబ్బులు వచ్చేశాయి.. కేసు వెనక్కి తీసుకుంటున్నాను..

ఫైనాన్షియర్, బిజినెస్ మెన్ శరణ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ''బెల్లంకొండ సురేష్ పై పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటున్నాను. లోక్ అదాలత్ ద్వారా కేసు కాంప్రమైజ్ చేసుకుంటాను......

Sharan : బెల్లంకొండ సురేష్ నుండి నా డబ్బులు వచ్చేశాయి.. కేసు వెనక్కి తీసుకుంటున్నాను..

Bellamkonda Suresh

 

Bellamkonda Suresh :  ఇటీవల సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ పై, అతని కుమారుడు సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై చీటింగ్ కేసు నమోదు అయింది. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఫైనాన్షియర్, బిజినెస్ మెన్ శరణ్ ఇటీవల వీరిద్దరిపై కేసు నమోదు చేశారు. తన వద్ద 85లక్షలు రూపాయలు తీసుకొని, ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని పోలీసులకి ఫిర్యాదు చేశాడు. బెల్లంకొండ సురేష్ కి డబ్బులు ఇచ్చినట్టు ఉన్న ఆధారాలను కూడా పోలీసులకు అందించాడు.

దీని తర్వాత బెల్లంకొండ సురేష్ ప్రెస్ మీట్ పెట్టి శరణ్ అన్యాయంగా కేసు పెట్టాడు. అతన్ని వదలను అంటూ సీరియస్ గా మాట్లాడాడు. పోలీస్ స్టేషన్ కి సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ తరపు వ్యక్తి శర్మ హాజరయ్యారు. అయితే తాజాగా ఈ కేసు అనూహ్యంగా ముగిసింది. బెల్లంకొండ సురేష్ పై పెట్టిన కేసుని వెనక్కి తీసుకుంటున్నట్టు శరణ్ ఇవాళ ప్రకటించాడు.

Standup Rahul : వరుణ్‌తేజ్ చీఫ్ గెస్ట్‌గా రాజ్‌తరుణ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఫైనాన్షియర్, బిజినెస్ మెన్ శరణ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ”బెల్లంకొండ సురేష్ పై పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటున్నాను. లోక్ అదాలత్ ద్వారా కేసు కాంప్రమైజ్ చేసుకుంటాను. తనకు రావాల్సిన డబ్బులు బెల్లంకొండ సురేష్ నుండి తిరిగి వచ్చేశాయి. పెద్దమనుషుల మధ్యవర్తిత్వం ద్వారా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మా మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు. గతంలో ఏ విధంగా కలిసి ఉన్నామో స్నేహితులుగా ఇప్పుడు కూడా అలాగే ఉంటాము” అని తెలిపారు.

RRR : అమెరికాలో భారీగా ‘ఆర్ఆర్ఆర్’.. 1150 పైగా థియేటర్స్‌లో..

అయితే బెల్లంకొండ సురేష్ ప్రెస్ మీట్ పెట్టి మరీ నేను డబ్బులు ఇవ్వనవసరం లేదు, అన్యాయంగా కేసు పెట్టారు అని సీరియస్ అయ్యారు. ఆ తర్వాత శరణ్ కూడా అలాగే నా డబ్బులివ్వకపోతే వదలను అంటూ మాట్లాడారు. ఒకర్నొకరు తిట్టుకున్నారు కూడా. కానీ ఇంతలోనే అనూహ్యంగా కేసు వెనక్కి తీసుకుంటున్నాను, డబ్బులు ఇచ్చేసారు అనడంతో ఈ కేసులో కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కానీ కేసు వెనక్కి తీసుకోవడంతో పోలీసులు ఈ కేసుని క్లోజ్ చేశారు.