Sharukh Khan : హిట్ కోసం పాకులాడుతున్న బాద్‌షా .. హిట్ డైరెక్టర్స్‌తో సినిమాలు..

ప్రస్తుతం షారుఖ్ వరుసగా సినిమాలు హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ తోనే ఒప్పుకుంటున్నాడు. షారుఖ్ ప్రస్తుతం 'పఠాన్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్......

Sharukh Khan :  హిట్ కోసం పాకులాడుతున్న బాద్‌షా .. హిట్ డైరెక్టర్స్‌తో సినిమాలు..

Sharukh

 

Sharukh Khan :  బాలీవుడ్ స్టార్ హీరో, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కి చాలా కాలంగా సరైన సక్సెస్ లు లేవు. అప్పుడెప్పుడో 2013లో చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాతో భారీ విజయం సాధించాడు షారుఖ్. ఆ తర్వాత ఆ రేంజ్ లో హిట్ ఇప్పటిదాకా కొట్టలేదు. షారుక్ చివరి సినిమా ‘జీరో’ కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం మూట కట్టుకుంది. ఇక ఇటీవల షారుక్ తనయుడు డ్రగ్స్ కేసులో జైలుకి వెళ్లి వచ్చాడు. ఇలా గత కొన్ని సంవత్సరాలుగా కెరీర్ లో, పర్సనల్ గా అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి.

 

దీంతో ప్రస్తుతం షారుఖ్ వరుసగా సినిమాలు హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ తోనే ఒప్పుకుంటున్నాడు. షారుఖ్ ప్రస్తుతం ‘పఠాన్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్. ‘వార్’ సినిమాతో అందర్నీ మెప్పించిన సిద్దార్థ్ ఆనంద్ ఇప్పుడు షారుక్ ని ‘పఠాన్’గా చూపించడానికి సిద్దమవుతున్నాడు. ఆ తర్వాత షారుఖ్ ఓకే చేసిన రెండు సినిమాల డైరెక్టర్స్ కూడా మంచి హిట్స్ తో ఫామ్ లో ఉన్న వాళ్ళే. తమిళ్ లో వరుసగా హిట్స్ సాధించిన డైరెక్టర్ అట్లీతో షారుఖ్ ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి వెళ్లనుంది.

Mahesh Babu : తల్లికి స్పెషల్ బర్త్‌డే విషెష్ తెలిపిన సూపర్ స్టార్

తాజాగా మున్నాభాయ్ MBBS, పీకే, 3 ఇడియట్స్.. లాంటి బ్లాక్ బస్టర్ లని అందించిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో మరో సినిమాని అనౌన్స్ చేశారు షారుఖ్. ‘డుంకి’ అనే టైటిల్ తో ఈ సినిమాని అనౌన్స్ చేశారు. ఇందులో తాప్సి హీరోయిన్ గా నటించనుంది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని 22 డిసెంబర్ 2023న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇలా వరుసగా హిట్స్ ఉన్న డైరెక్టర్స్ తోనే సినిమాలని అనౌన్స్ చేస్తున్నాడు షారుఖ్. మరి ఈ ప్లాన్ అయినా వర్క్ అవుట్ అయి షారుఖ్ మరో భారీ హిట్ కొట్టి ఒకప్పటి వైభవాన్ని పొండుతాడేమో చూడాలి.