Sharukh Khan : కొడుక్కి బెయిల్.. లీగల్ టీంకి పార్టీ ఇచ్చిన షారుఖ్

షారూఖ్ ఖాన్ తన న్యాయవాద బృందాన్ని కలిశారు. షారూఖ్, అతని లీగల్ టీమ్ కలిసి నవ్వుతూ ఫొటోలకి ఫోజ్ ఇచ్చారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆర్యన్ కు బెయిల్

Sharukh Khan : కొడుక్కి బెయిల్.. లీగల్ టీంకి పార్టీ ఇచ్చిన షారుఖ్

Sharukh

Sharukh Khan :  ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అరెస్టు అనంతరం పలు నాటకీయ పరిణామాల మధ్య ఆర్యన్ ఖాన్ మూడు వారాల పాటు కస్టడీలో ఉన్నాడు. ఇన్ని రోజులూ ఆర్యన్ జైలులో గడిపాడు. ఆర్యన్ ఖాన్ తరపున న్యాయవాది సతీష్ మనేషిండే బృందం కోర్టులో వాదించారు. చివరికి హై కోర్టు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు. నిన్న ఆర్యన్ కి బెయిల్ మంజూరు అవ్వడంతో ఇవాళ బయటకి రానున్నాడు.

Aryan Khan : ముంబైలో ఆర్యన్ కి బెయిల్.. కర్నూల్ లో సంబరాలు.. విమర్శిస్తున్న నెటిజన్లు

నిన్న ఆర్యన్ కి బెయిల్ మంజూరు అయిన తర్వాత న్యాయవాది సతీష్ మీడియాతో మాట్లాడుతూ… ఆర్యన్ ఖాన్ చివరికి హైకోర్ట్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అక్టోబరు 2, 2021న అతన్ని అదుపులోకి తీసుకున్న మొదటి క్షణం నుండి ఇప్పటి వరకూ ఆర్యన్ దగ్గర ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదు. అలాగే డ్రగ్స్ కు సంబంధించిన ఆధారాలు, వినియోగం వంటివి ఏమీ దొరకలేదు. మా ప్రార్థనలను మిస్టర్ జస్టిస్ నితిన్ సాంబ్రే అంగీకరించి, ఆర్యన్‌కి బెయిల్ మంజూరు చేసినందుకు మేము దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సత్యమేవ జయతే అని అన్నారు.

Niharika : నిర్మాతగా మెగా డాటర్.. ఓటిటిలో సినిమా

ఆ తర్వాత షారూఖ్ ఖాన్ తన న్యాయవాద బృందాన్ని కలిశారు. షారూఖ్, అతని లీగల్ టీమ్ కలిసి నవ్వుతూ ఫొటోలకి ఫోజ్ ఇచ్చారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆర్యన్ కు బెయిల్ రావడంపై సంతోషం వ్యక్తం చేసిన షారుఖ్ నిన్న రాత్రి తన లీగల్ టీంకు పార్టీ ఇచ్చారని సమాచారం. ఆర్యన్ కి బెయిల్ రావడం కోసం షారుఖ్ బాగానే ఖర్చుపెట్టి, బాగా కష్టపడ్డాడని తెలుస్తుంది. మరో పక్క షారుఖ్ అభిమానులు ఆయన ఇంటి వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.