Sharukh Khan : ఆ విషయంలో డైరెక్టర్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్న షారుఖ్

ఆర్యన్ ఖాన్ బయటికొచ్చాక తనకి అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు షారూఖ్ ఖాన్. ఇక పరిస్థితులు నార్మల్ అవ్వడంతో మళ్ళీ షూటింగ్స్ మొదలు పెట్టనున్నాడని సమాచారం. అయితే షారుఖ్ కొత్తగా

Sharukh Khan : ఆ విషయంలో డైరెక్టర్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్న షారుఖ్

Sharukh

Sharukh Khan :  గత కొద్ది రోజులుగా ఆర్యన్ కేసు వల్ల సినిమాలన్నీ ఆపేసాడు షారుఖ్. ఆర్యన్ కోసమే ఎక్కువ సమయం కేటాయించాడు. ఆర్యన్ బెయిల్ తో బయటకి రావడంతో ఈ బాలీవుడ్ బాద్ షా ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతున్నారు. ఆర్యన్ ఖాన్ బయటికొచ్చాక తనకి అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు షారూఖ్ ఖాన్. ఇక పరిస్థితులు నార్మల్ అవ్వడంతో మళ్ళీ షూటింగ్స్ మొదలు పెట్టనున్నాడని సమాచారం.

Chaurasia : నటి చౌరాసియా పై దాడిలో నిందితుడి వేలిముద్రలు లభ్యం..

అయితే షారుఖ్ కొత్తగా డైరెక్టర్స్ కి ఓ రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం షారుఖ్ కి సంబంధించి రెండు సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. మరి కొన్ని ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా టీమ్ మెంబర్స్ తో మీటింగ్స్ పెట్టి తన రిక్వైర్ మెంట్స్ తో పాటు కొత్తగా రిక్వెస్టులు చెబుతున్నాడు షారుఖ్. వేరే దేశాల్లో ఇప్పట్లో షూటింగ్స్ వద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాడట.

Bigg Boss 5 : నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు.. వెళ్ళిపో.. సిరిపై సీరియస్ అయిన ష‌ణ్ను

షారుఖ్ ‘పఠాన్’ సినిమా అక్టోబర్ 10న స్పెయిన్ లో షూటింగ్ ఫిక్స్ చేసుకుంది. అయితే ఆర్యన్ కేసు వల్ల ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. ‘పఠాన్’ సినిమా యూనిట్ ఇప్పుడు షూట్ ప్లాన్ చేయాలని చూస్తే షారుఖ్ ఫారెన్ లో షూటింగ్ వద్దు అంటున్నాడు. ‘పఠాన్’ డైరెక్టర్ తప్పదు అనడంతో ఎక్కువ రోజులు పెట్టొద్దని, తన ఫ్యామిలీకి ప్రస్తుతం నేను దగ్గర ఉండాలని చిన్న షెడ్యూల్స్ ప్లాన్ చెయ్యమని డైరెక్టర్ కి చెప్పాడట.

Raghava Lawrence : రియల్ సినతల్లి ఆశీర్వాదం తీసుకున్న లారెన్స్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు

ఇక తమిళ డైరెక్టర్ అట్లీతో కూడా ఓ భారీ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాని ప్లాన్ చేసాడు షారుఖ్. అది కూడా షూటింగ్ దశలో ఉంది. అట్లీతో కూడా ఫారెన్ సీన్స్ ఏమన్నా ఉంటే అన్ని ఇండియాలోనే ప్లాన్ చేయమని చెప్పాడని సమాచారం. అయితే ముందు షారూఖ్ ఉన్న సీన్స్ కాకుండా మిగిలిన వాళ్ల సీన్స్ కంప్లీట్ చేయమని అట్లీకి చెప్పాడు. ఇలా ఆర్యన్ కేసు తర్వాత మరి కొన్ని రోజులు ఫ్యామిలీకి ఎక్కువ టైం కేటాయించాలి అనే నేపథ్యంలో ప్రస్తుతానికి ఫారెన్ షూట్స్ వద్దు అంటున్నాడు షారుఖ్. ఇందుకోసం డైరెక్టర్స్ ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు. అయినా బాలీవుడ్ బాద్షా అడిగితే డైరెక్టర్స్ ఒప్పుకోకుండా ఉంటారా ?