Oke Oka Jeevitham : శర్వా 30.. ‘ఒకే ఒక జీవితం’..

శర్వా 30వ సినిమాకి ‘ఒకే ఒక జీవితం’ అనే టైటిల్‌ క‌న్ఫ‌ర్మ్ చేశారు.. సైన్స్‌ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది..

Oke Oka Jeevitham : శర్వా 30.. ‘ఒకే ఒక జీవితం’..

Oke Oka Jeevitham

Oke Oka Jeevitham: యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ‌ర్వానంద్ త‌న 30వ సినిమాను డెబ్యూ డైరెక్టర్ శ్రీ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్. ఆర్. ప్ర‌కాష్ బాబు, ఎస్.ఆర్. ప్ర‌భు నిర్మిస్తున్నారు.ఈ మూవీకి ‘పెళ్లిచూపులు’ డైరెక్టర్ త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ రాస్తుండడం విశేషం. సోమవారం సాయంత్రం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్‌. శర్వా 30వ సినిమాకి ‘ఒకే ఒక జీవితం’.. అనే టైటిల్‌ క‌న్ఫ‌ర్మ్ చేశారు. సైన్స్‌ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది.

Sharwanand 30

శ‌ర్వానంద్ వెన‌కాల గిటార్ వేసుకుని ఉన్నాడు. ఈ పోస్టర్‌లో ఒక వైపు పచ్చదనం, పోస్టాఫీసు, లెటర్, మ్యూజిక్ క్యాసెట్, గాలిపటాలు మొదలైనవి చూపించారు. మరొక వైపు కర్మాగారాలు, సెల్ టవర్, మొబైల్, మ్యూజిక్ సిస్టమ్, ఫ్లైట్‌ చూపించారు. ఈ పోస్టర్ ప్రపంచీకరణ ప్రభావాన్ని వివరించేలా ఉంది.

శ‌ర్వానంద్ స‌ర‌స‌న రీతు వ‌ర్మ‌ హీరోయిన్‌గా న‌టిస్తుండగా వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి స‌పోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత కథ, క్యారెక్టర్ నచ్చడంతో అక్కినేని అమ‌ల ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. జేక్స్ బీజోయ్ సంగీతం స‌మ‌కూరుస్తుండగా ‘డియ‌ర్ కామ్రేడ్’ సినిమాటోగ్రాఫ‌ర్‌ సుజీత్ సారంగ్, ఎడిట‌ర్ శ్రీ జిత్ సారంగ్ ఈ చిత్రంలో భాగ‌మ‌య్యారు.

ఫ్యామిలీ ఆడియెన్స్‌లో శ‌ర్వానంద్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. సై – ఫై ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్‌కి న‌చ్చే విధంగా ఉండ‌బోతుంది. త‌ల్లి-కొడుకుల బంధంతో ఉన్న సినిమాలు అన్నీ ఆకట్టుకున్నాయి. ఆ కోవలో ‘ఒకే ఒక జీవితం’ కూడా అలరిస్తుందని మూవీ మేకర్స్ తెలిపారు.