#Sharwa35 : శర్వానంద్ 35 అనౌన్స్.. షూటింగ్ ఎక్కడ జరుగుతుందో వెరైటీగా చెప్పారు..

శర్వానంద్ 35వ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసి శర్వాకి బర్త్ డే విషెస్ చెప్పారు. భలేమంచిరోజు, శమంతకమణి, హీరో లాంటి సినిమాలతో మెప్పించిన డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య........

#Sharwa35 : శర్వానంద్ 35 అనౌన్స్.. షూటింగ్ ఎక్కడ జరుగుతుందో వెరైటీగా చెప్పారు..

Sharwanand 35th movie announced on his birthday

#Sharwa35 :  శర్వానంద్ వరుస పరాజయాల తర్వాత ఇటీవలే ఒకేఒక జీవితం అనే సినిమాతో మంచి విజయం సాధించాడు. అలాగే ఇటీవలే నిశ్చితార్థం కూడా చేసుకొని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు శర్వా. తాజాగా నేడు శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా శర్వా నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇచ్చారు.

శర్వానంద్ 35వ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసి శర్వాకి బర్త్ డే విషెస్ చెప్పారు. భలేమంచిరోజు, శమంతకమణి, హీరో లాంటి సినిమాలతో మెప్పించిన డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ 35వ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో హిట్స్ కొడుతూ, మరిన్ని ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. శర్వానంద్ 35వ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా ఎక్కడ షూటింగ్ జరుగుతుందో పోస్టర్ మీద లాటిట్యూడ్, లాంగిట్యూడ్ లని పోస్ట్ చేసి తెలిపారు. వాళ్ళు ఇచ్చిన దాని బట్టి లండన్ లో ఈ సినిమా షూట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.

Balakrishna : బాలకృష్ణ కొత్త యాడ్ చూశారా? బంగారం, వజ్రాలతో మెరిపించిన బాలయ్య..

ఇక శర్వానంద్ తన పుట్టిన రోజు నాడు 20 సంవత్సరాల సినీ ప్రయాణం అని ఎమోషనల్ గా ఒక లెటర్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తనకు సపోర్ట్ చేసిన వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్తూ మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేస్తానని తెలిపాడు.