Sharwanand: ప్రమోషన్స్ కి రాని వెన్నల కిషోర్ పై స్టేజ్ మీదే ఫైర్ అయిన శర్వానంద్.. నీకు సినిమా ఇప్పించిందే నేను గుర్తుపెట్టుకో!

టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. "మహానుభావుడు" సినిమా తరువాత అరడజను సినిమాలు తీసిన ఒక్క హిట్టు దక్కలేదు. ఈ శుక్రవారం విడుదలవుతున్న "ఒకే ఒక జీవితం" సినిమాతో అయిన ఒక సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. బుధవారం రాత్రి "ఒకేఒక జీవితం" ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోగా, ఈ ఈవెంట్ కు వెన్నల కిషోర్ హాజరు కాలేదు.

Sharwanand: ప్రమోషన్స్ కి రాని వెన్నల కిషోర్ పై స్టేజ్ మీదే ఫైర్ అయిన శర్వానంద్.. నీకు సినిమా ఇప్పించిందే నేను గుర్తుపెట్టుకో!

Sharwanand Funny Comments on Vennala Kishore

Sharwanand: టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. “మహానుభావుడు” సినిమా తరువాత అరడజను సినిమాలు తీసిన ఒక్క హిట్టు దక్కలేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని, పక్కా హిట్ అనుకుని తీసిన ‘పడిపడి లేచే మనసు’ కూడా నిరాశపరచడంతో కొన్నాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్లినట్టు తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ శుక్రవారం విడుదలవుతున్న “ఒకే ఒక జీవితం” సినిమాతో అయిన ఒక సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

Sharwanand : మా అమ్మ బంగారం అమ్మి సినిమా తీసి అప్పులపాలయ్యాను.. మూడు నెలలు బయటకి రాలేదు..

టైం ట్రావెల్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా కథకు అమ్మ సెంటిమెంట్ ని జతచేసి చాలా హృద్యంగా చూపించినట్టు మూవీ ప్రీమియర్ చూసిన హీరో నాగార్జున మీడియాతో పంచుకున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదలవుతున్న ఈ మూవీలో శర్వానంద్ కు జంటగా రీతూవర్మ నటించగా, అక్కినేని అమల తల్లి పాత్రలో కనిపిస్తున్నారు. ప్రధాన తారాగణంగా నాజర్, వెన్నల కిషోర్, ప్రియదర్శి వంటి వారు నటిస్తున్నారు.

ఇక విషయానికి వస్తే బుధవారం రాత్రి “ఒకేఒక జీవితం” ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోగా, ఈ ఈవెంట్ కు వెన్నల కిషోర్ హాజరు కాలేదు. ఈవెంట్ లో హీరో శర్వానంద్ అందర్నీ ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. “థ్యాంక్యూ దర్శి నాతో ఒక మంచి ఫ్రెండ్ గా ఉన్నందుకు, ఆ నాకొడుకు మిస్ అయ్యిపోయాడు. సినిమా ప్రమోషన్స్ కి రావా, అరేయ్ కిషోర్ నీకు సినిమా ఇప్పించిందే నేను. ఎక్కడ ఉన్నావో గుర్తుపెట్టుకో వస్తున్న నీ దగ్గరకు.. లవ్ యు డార్లింగ్” అంటూ వారిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని వేదిక సాక్షిగా వెల్లడించారు.