Sharwanand: సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్‌తో మరోసారి చేతులు కలుపుతున్న శర్వా!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుసగా తన సినిమాలను అనౌన్స్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఒకే ఒక జీవితం తరువాత ఇటీవల తన కెరీర్‌లోని 35వ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు ఈ హీరో. కాగా, ఇప్పుడు మరో సినిమాను కూడా ఓకే చేసేందుకు శర్వా రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

Sharwanand: సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్‌తో మరోసారి చేతులు కలుపుతున్న శర్వా!

Sharwanand To Join Hands With Director Merlapaka Gandhi

Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుసగా తన సినిమాలను అనౌన్స్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఒకే ఒక జీవితం తరువాత ఇటీవల తన కెరీర్‌లోని 35వ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు ఈ హీరో. కాగా, ఇప్పుడు మరో సినిమాను కూడా ఓకే చేసేందుకు శర్వా రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

Sharwanand : త్రివిక్రమ్ శిష్యుడు దర్శకత్వంలో శర్వానంద్ సినిమా ఆగిపోయిందా?

శర్వానంద్‌కు ఎక్స్‌ప్రెస్ రాజా వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన దర్శకుడు మేర్లపాక గాంధీతో మరోసారి చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నాడట. మేర్లపాక గాంధీ తెరకెక్కించే సినిమాలకు మంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది. దీంతో మరోసారి ఈ డైరెక్టర్‌తో సినిమాను తెరకెక్కించేందుకు శర్వా కూడా ఆసక్తిని కనబరుస్తున్నాడు. ఇక ఇప్పటికే మేర్లపాక గాంధీ ఓ కథను శర్వాకు నెరేట్ చేశాడని.. కథ నచ్చిన శర్వా, ఈ సినిమాకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

Sharwanand : నిశ్చితార్థం చేసుకున్న హీరో శర్వానంద్..

ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోందట. కాగా, ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయబోతుందని.. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఈసారి శర్వా కోసం మేర్లపాక గాంధీ ఎలాంటి కథను పట్టుకొస్తున్నాడో చూడాలి.