Sharwanand : శర్వానంద్ పెళ్ళికి ముహూర్తం.. జైపూర్ ప్యాలెస్ లో ఆ రోజే..

రిపబ్లిక్ డే జనవరి 26న శర్వానంద్ తన నిశ్చితార్థం(Engagement) ఫోటోలని షేర్ చేసి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. అతి తక్కువ మంది మధ్యలో, కేవలం కుటుంబ సభ్యులు, ఆత్మీయ అతిధులు, శర్వా సన్నిహితులు, కొంతమంది సినీ ప్రముఖుల మధ్య హైదరాబాద్(Hydearabad) లోని ఓ ప్రైవేట్ హోటల్ లో శర్వానంద్ నిశ్చితార్థం చేసుకున్నాడు.

Sharwanand : శర్వానంద్ పెళ్ళికి ముహూర్తం.. జైపూర్ ప్యాలెస్ లో ఆ రోజే..

Sharwanand Wedding date fixed planned in Jaipur Palace

Sharwanand Wedding :  టాలీవుడ్(Tollywood) హీరోలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరు శర్వానంద్. వైవిధ్యమైన కథలతో మెప్పిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సైడ్ హీరో నుంచి హీరోగా ఎదిగిన శర్వానంద్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రిపబ్లిక్ డే జనవరి 26న శర్వానంద్ తన నిశ్చితార్థం(Engagement) ఫోటోలని షేర్ చేసి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. అతి తక్కువ మంది మధ్యలో, కేవలం కుటుంబ సభ్యులు, ఆత్మీయ అతిధులు, శర్వా సన్నిహితులు, కొంతమంది సినీ ప్రముఖుల మధ్య హైదరాబాద్(Hydearabad) లోని ఓ ప్రైవేట్ హోటల్ లో శర్వానంద్ నిశ్చితార్థం చేసుకున్నాడు.

రక్షిత అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని శర్వా నిశ్చితార్థం చేసుకున్నాడు. రక్షిత ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా వర్క్ చేస్తుందని సమాచారం. రక్షిత మాజీ మంత్రి, టీడీపీ నేత స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు, హైకోర్టు లాయర్ మధుసూధనా రెడ్డి కూతురు. వీరి నిశ్చితార్థం ఫొటోలు అప్పట్లో వైరల్ గా మారాయి. అయితే ఎంగేజ్మెంట్ జరిగి నెలలు గడుస్తున్నా ఇంకా పెళ్లి కబురు చెప్పట్లేదేంటి అని అంతా అనుకుంటుంటే తాజాగా ఆ కబురు కూడా చెప్పేశాడు శర్వా.

Sharwanand Engagement: హీరో శర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌లో మెరిసిన తారలు

శర్వానంద్, రక్షిత వివాహం జూన్ 3న రాత్రి జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో ఘనంగా జరగనుంది. జూన్ 2న మెహందీ ఫంక్షన్, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుని చేయడం, పలు కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించనున్నారు. ఈమేరకు శర్వా ఫ్యామిలీ మీడియాకు సమాచారం ఇచ్చింది. ఇక జైపూర్ లో జరిగే ఈ పెళ్ళికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానున్నట్టు సమాచారం. దీంతో అభిమానులు, నెటిజన్లు శర్వాకు అభినందనలు తెలుపుతున్నారు.