Leader 2: సూర్యతో శేఖర్ కమ్ముల లీడర్ 2 .. రానాతో ఎక్కడ చెడింది?

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోని మిగిలిన డైరెక్టర్స్ కి భిన్నంగా ఆయన సినిమాలు తెరకెక్కిస్తారు.

Leader 2: సూర్యతో శేఖర్ కమ్ముల లీడర్ 2 .. రానాతో ఎక్కడ చెడింది?

Leader

Leader 2: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోని మిగిలిన డైరెక్టర్స్ కి భిన్నంగా ఆయన సినిమాలు తెరకెక్కిస్తారు. హ్యాపీ డేస్, ఆనంద్, గోదావరి, లీడర్, లవ్ స్టోరీ, ఫిదా వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శేఖర్ కమ్ముల తన సినిమాలలో ఎక్కడా కూడా వైలెన్స్ లేకుండానే ప్రేక్షకులకు సినిమాను దగ్గర చేస్తాడు.

Leader : మళ్ళీ రానా, శేఖర్ కమ్ముల కాంబినేషన్.. ‘లీడర్ 2’ త్వరలో??

కాగా.. మిగతా అన్ని సినిమాలకు కాస్త భిన్నంగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో 2010లో ద‌గ్గుబాటి రానా ప్రధాన పాత్ర‌లో లీడ‌ర్ అనే సినిమా తీశాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఈ సినిమా పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రాల్లోనే ఓ మంచి క్లాసిక్ గా నిలబడిపోయింది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల, రానా కాంబోలో మళ్ళీ సినిమాలు రాలేదు. ఈ హిట్ సినిమాకు సీక్వెల్ కావాలనుకుని.. అందుకే లీడ‌ర్ 2 చేయాల‌ని ఎప్ప‌టి నుంచో సన్నాహాలు జరుగుతున్నా కుద‌ర‌డం లేదు. అయితే.. శేఖర్ కమ్ముల ఇప్పుడు రానాను కాదని తమిళ స్టార్ హీరో సూర్యతో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Rajamouli-Sekhar Kammula : వీళ్లతో సినిమాలు చేస్తే ఫ్లాపులు.. విడాకులేనంట!

ఇప్పటికే రాజకీయాల నేపథ్యంలో సాగే ఓ కథను సూర్యకు వినిపించిన శేఖర్ కమ్ముల ఈ కథకు ‘లీడర్ 2’ అనే టైటిల్ ను అనుకుంటున్నారట. మరి దీనికి రానా లీడర్ కి సంబంధం ఉందా.. లేక ఇది మరో కొత్త కథనా అన్నది తెలియదు. ఇప్పటికే తమిళ స్టార్ ధనుష్ తో ఓ సినిమా ప్లాన్ చేసిన శేఖర్.. ఇప్పుడు మరో తమిళ హీరోతోనే మరో సినిమా సన్నాహాలు చేస్తున్నాడు. సూర్యతో చేసేది లీడర్ సీక్వెల్ సినిమానే అయితే.. తెలుగు హీరోను కాదని.. శేఖర్ తమిళ స్టార్స్ ను సంప్రదించడం కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. అయితే.. దాని లెక్కలేంటో ఆ శేఖరుడికే తెలియాలి.