Sherlyn Chopra: నేనెక్కడికి పారిపోలేదు.. నీలిచిత్రాల కేసుపై షెర్లిన్!

పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టైన విషయం తెలిసిందే. ఈ కేసుతో బాలీవుడ్ ఒకరకంగా అట్టుడికిపోతోంది. ఒకవైపు ఈ కేసులో ఎవరెవరికి లింకులు ఉన్నాయా అనే కోణంలో సైబర్ క్రైమ్, పోలీసులు విచారణ జరుపుతుంటే.. బాధితులు, పీడితులు ఎవరెవరు బయటకు వస్తారా అనే ఆసక్తి నెలకొంది.

Sherlyn Chopra: నేనెక్కడికి పారిపోలేదు.. నీలిచిత్రాల కేసుపై షెర్లిన్!

Sherlyn Chopra

Sherlyn Chopra: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టైన విషయం తెలిసిందే. ఈ కేసుతో బాలీవుడ్ ఒకరకంగా అట్టుడికిపోతోంది. ఒకవైపు ఈ కేసులో ఎవరెవరికి లింకులు ఉన్నాయా అనే కోణంలో సైబర్ క్రైమ్, పోలీసులు విచారణ జరుపుతుంటే.. బాధితులు, పీడితులు ఎవరెవరు బయటకు వస్తారా అనే ఆసక్తి నెలకొంది. ఈ కేసులో బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీలుగా పేరున్న ఒక్కొక్కరు బయటకి వచ్చి స్పందన తెలియజేస్తున్నారు.

ఇప్పటికే పూనమ్ పాండే ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. రాజ్ కుంద్రా చీకటి వ్యవహారంలో తానూ బాధితురాలినే అంటూ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ వ్యవహారంలో షెర్లిన్ చోప్రా పేరు కూడా గత రెండు రోజులుగా వినిపిస్తుండగా ఇప్పుడు షెర్లిన్ కూడా ఈ వ్యవహారంలో ఒక వీడియో మెసేజ్ ఇచ్చింది. రాజ్ కుంద్రా కేసులో మొదట పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది తానేనని షెర్లిన్ చోప్రా చెప్పింది.

తనపై రకరకాల ప్రచారం జరుగుతున్నట్లుగా తాను ఎక్కడకి పారిపోలేదని.. ఆ అండర్ గ్రౌండ్ కి వెళ్లలేదని.. మహారాష్ట్ర సైబర్ సెల్ కు స్టేట్మెంట్ ఇచ్చిన మొదటి వ్యక్తిని తానేనని షెర్లిన్ చెప్పింది. గతంలో రాజ్ కుంద్ర ఆర్మ్‌స్ప్రైమ్ మీడియా అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న షెర్లిన్.. ఆ తర్వాత కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసినట్లు చెప్పుకొచ్చింది. ఈ కేసు విషయంలో పలువురు జర్నలిస్టులు తనను సంప్రదించేందుకు ప్రయతించినా తాను అందుబాటులో లేనని.. కానీ ఇప్పుడు ఇలా అందరికీ స్పష్టత ఇచ్చేందుకే వచ్చానని చెప్పింది.

కాగా, పోర్న్ చిత్రాలు, యాప్స్ తయారీ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో వ్యాపారవేత్త, శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రను ముంబై పోలీసులు జూలై 19న అరెస్టు చేయగా.. అతన్ని జూలై 23 వరకు కస్టడీకి తరలించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ పోలీసులు విచారిస్తుండగా ఈ కేసుపై రకరకాల ప్రచారం జరుగుతుంది. కాగా షెర్లిన్ చోప్రాపై కూడా అలాంటి ఆరోపణలే వినిపిస్తుండగా ఇలా వీడియో రూపంలో బయటకొచ్చింది. ఈ వీడియోలో కేసుపై పెద్దగా స్పష్టత ఇవ్వని షెర్లిన్ తాను ఎక్కడకి అజ్ఞాతంలోకి వెళ్లలేదని మాత్రం చెప్పుకొచ్చింది.