Shilpa Shetty: పెళ్లి ప్రమాణాలను గుర్తు చేసుకున్న శిల్పా.. ఫోటోలు వైరల్!

శిల్పా శెట్టి, భర్త రాజ్ కుంద్రాలపై ఆరోపణలు, కేసుల గురించి గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్ గా నడిచిన సంగతి తెలిసిందే. శిల్పా-కుంద్రాల సంసారం జీవితంపై కూడా ఎన్నో ప్రచారాలు..

10TV Telugu News

Shilpa Shetty: శిల్పా శెట్టి, భర్త రాజ్ కుంద్రాలపై ఆరోపణలు, కేసుల గురించి గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్ గా నడిచిన సంగతి తెలిసిందే. శిల్పా-కుంద్రాల సంసారం జీవితంపై కూడా ఎన్నో ప్రచారాలు కూడా వచ్చాయి. శిల్పా పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయిందని.. చివరికి విడాకుల వరకు వెళ్లిందని కూడా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగిపోయింది. కానీ.. అదేదీ నిజం కాలేదు. ఈ జంట సమస్యలను బలంగా ఎదుర్కొంటుంది. తమపై వచ్చిన ఆరోపణలను కలిసి కట్టుగానే ఎదుర్కొంటున్నారు.

Shyam Singha Roy: ఫ్యాన్స్‌తో నానీ.. శ్యామ్ కోసం సరికొత్త ప్రమోషన్!

ఇప్పటి వరకు వచ్చిన వార్తలన్నీ తప్పని నిరూపిస్తూ శిల్పా తమ పెళ్లి రోజు సందర్భంగా భర్త రాజ్ కోసం ప్రత్యేక పోస్ట్ చేసింది. నవంబర్‌ 22, సోమవారం శిల్పాశెట్టి-రాజ్‌ కుంద్రా దంపతుల 12వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా శిల్పాశెట్టి, తన భర్తకు సోషల్‌ మీడియా వేదికగా విష్‌ చేసింది. ఆమె తన ఇన్‌స్టా గ్రామ్‌లో వారి వివాహ వేడుక చిత్రాల కొలేజ్‌ను పోస్ట్‌ చేసింది. తాళి కట్టడం, సింధూరం పెట్టడం వంటి మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు.

Bigg Boss 5: జెస్సీ హెల్త్ ప్రాబ్లమ్ ఎలిమినేషన్.. స్క్రిప్ట్ ప్రకారమే చేశారా?

పెళ్లినాటి ఫొటోలు షేర్‌ చేసిన శిల్పా.. ‘12 సంవత్సరాల క్రితం వివాహ బంధంతో మేము ఒక్కటయ్యాం. కష్టాలు ధైర్యంగా ఎదుర్కొంటూ.. ఆనందాలు సరదాగా పంచుకుంటూ.. ఒకరికొకరం తోడుగా ప్రేమతో ప్రయాణాన్ని సాగించాలని ఆనాడు చేసిన పెళ్లి ప్రమాణాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు రాజ్‌.. మన జీవితంలో మరెన్నో హరివిల్లులు విరియాలని.. సంతోషాలు రావాలని కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

×