Shimbu : హాస్పిటల్ లో శింబు.. ఆందోళనలో అభిమానులు..

షూటింగ్ సమయంలో శింబు అస్వస్థతకి గురయ్యాడు. అలసట, గొంతు నొప్పి రావడంతో షూటింగ్ మధ్యలోనే ఆపేసి వెంటనే హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు శింబు. దీంతో అతని అభిమానులు, సన్నిహితులు.....

Shimbu : హాస్పిటల్ లో శింబు.. ఆందోళనలో అభిమానులు..

Shimbu

Shimbu :  తమిళ స్టార్ హీరో శింబు నిన్న రాత్రి హాస్పిటల్లో చేరాడు. శింబు హాస్పిటల్ లో చేరిన విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తమ అభిమాన హీరోకు ఏమైంది అంటూ కొంతమంది హాస్పిటల్ వద్దకు కూడా వచ్చారు. ఏమైందో తెలియకుండానే తొందరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మళ్ళీ కరోనా విజృంభిస్తున్న సమయంలో శింబు హాస్పిటల్లో చేరడం, ఇటీవలే కమల్ హాసన్ కి కరోనా రావడం చూసి కొంతమంది శింబుకి కరోనా అని తప్పుడు వార్తలు ప్రచారం చేశారు.

Bigg Boss 5 : సిరి కోసం ప్రియుడి ప్రమోషన్స్.. తన కష్టాలు మీకు తెలీవు.. సపోర్ట్ చేయండి..

ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుంది. ఈ షూటింగ్ సమయంలో శింబు అస్వస్థతకి గురయ్యాడు. అలసట, గొంతు నొప్పి రావడంతో షూటింగ్ మధ్యలోనే ఆపేసి వెంటనే హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు శింబు. దీంతో అతని అభిమానులు, సన్నిహితులు కంగారు పడ్డారు.

Rajanikanth : ‘పెద్దన్న’ మూవీ డైరెక్టర్ కి సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్ ఇచ్చిన రజినీకాంత్

అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు అని, అతడికి ఏమీ కాలేదు, గొంతు నొప్పి కారణంగా చెన్నైలో ఒక హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడని, అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు అని శింబు మేనేజింగ్ టీం స్పష్టం చేశారు. రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతాడని తెలిపారు.