Shiva Rajkumar : అందుకే గెస్ట్ రోల్స్ చేస్తున్నా అంటున్న స్టార్ హీరో.. పాన్ ఇండియా స్టార్ అంటే కచ్చితంగా అది వచ్చి ఉండాలి..

వేద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగులో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శివరాజ్ కుమార్ పాన్ ఇండియా తో పాటు స్టార్ హీరో అయ్యుండి గెస్ట్ పాత్రలు చేయడంపై వ్యాఖ్యలు చేశారు. శివన్న మాట్లాడుతూ...................

Shiva Rajkumar : అందుకే గెస్ట్ రోల్స్ చేస్తున్నా అంటున్న స్టార్ హీరో.. పాన్ ఇండియా స్టార్ అంటే కచ్చితంగా అది వచ్చి ఉండాలి..

Kannada Star Hero Shiva Rajkumar comments on guest roles and pan India stars

Shiva Rajkumar :  కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ వేద సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకి రానున్నారు. వేద సినిమా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకి పాన్ ఇండియా సినిమాగా రానుంది. తెలుగులో కూడా ప్రమోషన్స్ భారీగానే చేస్తున్నారు చిత్రయూనిట్. ఇటీవలే వేద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించగా బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఇక వేద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగులో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శివరాజ్ కుమార్ పాన్ ఇండియా తో పాటు స్టార్ హీరో అయ్యుండి గెస్ట్ పాత్రలు చేయడంపై వ్యాఖ్యలు చేశారు. శివన్న మాట్లాడుతూ.. నాకు ఇటీవల మంచి మంచి పాత్రలు వస్తున్నాయి. అవి చిన్న పాత్రలైనా అందుకే చేస్తున్నా. రజినీకాంత్ సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరైనా కాదంటారా? జైలర్ లో ఛాన్స్ వచ్చింది చేశాను. బాలకృష్ణ 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో కూడా చిన్న పాత్ర పోషించాను. నాకు ధనుష్ అంటే ఇష్టం. అందుకే అతని సినిమా కెప్టెన్ మిల్లర్ లో చేస్తున్నాను. ఆ సినిమాలో నా పాత్ర చాలా చిన్నది, అయినా సరే ఆ పాత్ర బాగుందని చేస్తున్నాను. తెలుగులో కూడా చేయమని కొంతమంది కథలు వినిపిస్తున్నారు, నచ్చితే కచ్చితంగా చేస్తాను. బాలకృష్ణ కూడా మేమిద్దరం కలిసి చేద్దాం అన్నారు, చూడాలి మరి ఏమవుతుందో అని తెలిపారు.

Venky Atluri : మీమ్స్ వల్లే అలాంటి సినిమాలు తీయకూడదని ఫిక్స్ అయ్యా.. డైరెక్టర్ వెంకీ అట్లూరి..

ఇక పాన్ ఇండియా స్టార్స్ పై మాట్లాడుతూ..ఇటీవల కన్నడ, తెలుగు.. రెండు పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధి చెందుతున్నాయి. మంచి మంచి సినిమాలతో వస్తున్నారు. సినిమాల వల్లే పాన్ ఇండియా స్టార్లు అవుతున్నారు. పాన్ ఇండియా స్టార్లకు అన్నిటికంటే ముఖ్యం భాష తెలిసి ఉండాలి. పాన్ ఇండియా స్టార్ అన్ని భాషల్లో మాట్లాడగలగాలి. అన్ని భాషలు నేర్చుకోవాలి. నాకు తెలుగు కొద్దిగా వచ్చు, ఇంకా నేర్చుకోవాలి అని తెలిపారు.