Balakrishna : బాలయ్య – శివన్న సినిమాపై క్లారిటీ.. త్వరలోనే పాన్ ఇండియా మల్టీస్టారర్ ఫిలిం..

తాజాగా హైదరాబాద్ KPHB లో గ్రౌండ్స్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల పేరిట మరో భారీ సభను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఈ కార్యక్రమానికి అతిధిగా విచ్చేశారు.

Balakrishna : బాలయ్య – శివన్న సినిమాపై క్లారిటీ.. త్వరలోనే పాన్ ఇండియా మల్టీస్టారర్ ఫిలిం..

Shiva Rajkumar gives clarity on movie with Balakrishna

Shiva Rajkumar  :  2023 మే 28న నందమూరి తారక రామారావు(NTR) శత జయంతి జరుగుతుండడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది నుంచి శత జయంతి ఉత్సవాల పేరిట పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటిలో భాగంగానే ఇటీవల విజయవాడ(Vijayawada)లో భారీ సభ నిర్వహించగా రజినీకాంత్(Rajinikanth) ముఖ్య అతిథిగా వచ్చాడు. తాజాగా హైదరాబాద్ KPHB లో గ్రౌండ్స్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల పేరిట మరో భారీ సభను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చారు.

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఈ కార్యక్రమానికి అతిధిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సర్ శత జయంతి ఉత్సవాలకు నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు మేము కూడా చెన్నైలోనే పెరిగాము. రోజూ స్కూల్ కి వెళ్ళేటప్పుడు చెన్నైలో ఎన్టీఆర్ ఇంటి మీద నుంచి వెళ్ళేవాళ్ళం. డైలీ అక్కడ ఫుల్ గా జనాలు ఉండేవారు. ఆ జనాల్ని దాటుకొని వెళ్ళడానికి కనీసం 5 నిముషాలు పట్టేది. మాకు అది చూడటం డైలీ రొటీన్ అయిపొయింది. ఒక హీరో కోసం రోజూ అంతమంది క్రౌడ్ అంటే మాములు విషయం కాదు. ఎన్టీఆర్ సర్ సీఎం అయ్యాక ఫిలింఫేర్ అవార్డ్స్ హైదరాబాద్ లో జరిగితే సీఎం లా కాకుండా ఒక మాములు నటుడిలా వచ్చే అందరి గెస్టులని ఆయనే స్వయంగా రిసీవ్ చేసుకున్నారు, అది ఆయన గొప్పతనం. మా నాన్న, ఎన్టీఆర్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. దానివల్ల చిన్నప్పటి నుంచి నేను, బాలకృష్ణ క్లోజ్ అయ్యాం. ఏజ్ పెరిగే కొద్దీ మా స్నేహం ఇంకా బలపడుతుంది. బాలయ్య, నేను బ్రదర్స్ లాంటి వాళ్ళం. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాను. త్వరలో బాలకృష్ణ, నేను కలిసి ఓ భారీ సినిమా చేయబోతున్నాం అని తెలిపారు.

NTR 100 Years : తారక్, నేను కాదు.. సౌత్ ఇండియాని వరల్డ్ మ్యాప్‌లో పెట్టిన నటుడు ఎన్టీఆర్.. రామ్‌చరణ్!

దీంతో శివన్న- బాలయ్య కలిసి ఓ భారీ సినిమా చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా శివన్న మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇవ్వడంతో తెలుగు, కన్నడ అభిమానులు సంతోషిస్తున్నారు. మరి వీరిద్దర్నీ పెట్టి ఎలాంటి సినిమాను, ఏ డైరెక్టర్ చేస్తాడో చూడాలి మరి.