Kabzaa : బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన ఉపేంద్ర.. కబ్జ మూవీలో మరో స్టార్ హీరో!
కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ 'కబ్జ'. ఈ చిత్రంలో మరో శాండిల్వుడ్ స్టార్ హీరో సుదీప్ కూడా నటిస్తున్నాడు. కాగా ఇప్పుడు ఒక బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.

Shiva Rajkumar is apart of upendra and sudeep kabza movie
Kabzaa : కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘కబ్జ’. ఈ చిత్రంలో మరో శాండిల్వుడ్ స్టార్ హీరో సుదీప్ కూడా నటిస్తున్నాడు. శ్రియా సరన్ హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా విడుదల కాబోతున్న ఈ మూవీ పై టీజర్ రిలీజ్ ముందు వరకు ఎటువంటి అంచనాలు లేవు. కానీ టీజర్ తరువాత ఒక్కసారిగా సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. టీజర్ లోని విజువల్స్, ఎడిటింగ్, మ్యూజిక్.. ఆడియన్స్ లో కబ్జ పై క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.
Pawan Kalyan : ఆ ఇద్దరు హీరోలకు సారీ చెప్పిన పవన్ కళ్యాణ్..
ఇక ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్ వరుస పెట్టి సాంగ్స్ రిలీజ్ చేస్తూ, ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ వస్తున్నారు. మార్చి 4న ఈ మూవీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. కాగా ఇప్పుడు ఒక బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నాడు అంటూ గత కొంతకాలంగా కన్నడనాట వార్తలు వస్తున్నప్పటికీ చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. ఇన్ని రోజులు ఆ విషయాన్ని సస్పెన్స్ గా ఉంచిన మూవీ టీం.. తాజాగా శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో భాగం అయ్యారు అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది.
కన్నడలోని ముగ్గురు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారు అని తెలియడంతో ఆడియన్స్ లో సినిమా పై మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది. మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి ఆర్ చంద్రు దర్శకత్వం వహిస్తుండగా.. గతంలో చంద్రు, ఉపేంద్ర కలయికలో వచ్చిన ‘బ్రహ్మ’, ‘ఐ లవ్యూ’ చిత్రాల భారీ విజయాల్ని అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ తో పాటు పాన్ ఇండియా హిట్టుని కూడా కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ చేస్తున్నాడు.
The Action has turned more Fierce with his arrival ?
Karunada Chakravarthy #ShivaRajkumar enters the World of #Kabzaa ??#KabzaaFromMarch17@nimmaupendra @KicchaSudeep@shriya1109 @anandpandit6 @apmpictures @rchandru_movies @RaviBasrur @kp_sreekanth @vamsikaka pic.twitter.com/Hv2WSD6R9r
— BA Raju's Team (@baraju_SuperHit) March 3, 2023