Shiva Rajkumar: ఫిబ్రవరి 9న శివ రాజ్‌కుమార్ ‘వేద’ రిలీజ్.. ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన చిత్ర యూనిట్!

కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వేద’ కన్నడనాట రీసెంట్‌గా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్ పాత్ర, ఆయన చేసిన పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. కన్నడ సినిమాలకు తెలుగునాట మంచి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా ఇక్కడ బజ్ క్రియేట్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

Shiva Rajkumar: ఫిబ్రవరి 9న శివ రాజ్‌కుమార్ ‘వేద’ రిలీజ్.. ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన చిత్ర యూనిట్!

Shiva Rajkumar Veda Movie To Release On February 9

Shiva Rajkumar: కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వేద’ కన్నడనాట రీసెంట్‌గా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్ పాత్ర, ఆయన చేసిన పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. కన్నడ సినిమాలకు తెలుగునాట మంచి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా ఇక్కడ బజ్ క్రియేట్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

శివన్న ‘భజరంగీ 2’ టీజర్ అదిరిపోయిందిగా!

వేద చిత్రాన్ని తెలుగులో కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధంచిన ఫస్ట్‌లుక్ పోసర్ట్స్ రిలీజ్ చేసినప్పుడే ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా శివ రాజ్‌కుమార్ కెరీర్‌లో 125వ చిత్రంగా రావడంతో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని చిత్ర నిర్మాత ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాలోని కంటెంట్‌పై నమ్మకంతో ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత పేర్కొన్నారు.

కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుందని.. దీనికి సంబంధించిన టైటిల్ మరియు మోషన్ పోస్టర్స్‌ను ఇదివరకే ఆవిష్కరించింది చిత్ర బృందం. ఇక ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి ఈ చిత్ర బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. దర్శకుడు ఎ.హర్ష డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మరి వేద చిత్రం తెలుగునాట ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఫిబ్రవరి 9 వరకు వెయిట్ చేయాల్సిందే.