Shiva Shankar : చనిపోయే ముందు కొవిడ్ నెగిటివ్.. మహా ప్రస్థానంలో శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 75శాతం ఊపిరితిత్తులకు..

Shiva Shankar : చనిపోయే ముందు కొవిడ్ నెగిటివ్.. మహా ప్రస్థానంలో శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు

Shiva Shankar

Shiva Shankar : ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 75శాతం ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో డాక్టర్లు ఆయన్ను కాపాడలేకపోయారు. శివశంకర్ మాస్టర్ మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సినీ రంగానికి చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శివశంకర్‌ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మాస్టర్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Fridge : ఫ్రిజ్‌లో… ఆ.. ఆహార పదార్థాలను ఉంచకపోవటమే మేలు.. ఎందుకంటే?

కాగా, శివశంకర్ మాస్టర్ చనిపోయే ముందు కొవిడ్ నెగిటివ్‌గా ఏఐజీ డాక్టర్లు నిర్దారించారు. సోమవారం ఉదయం 5 గంటలకు శివశంకర్ మాస్టర్ పార్థివదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. మణికొండ పంచవటి కాలనీలోని శివశంకర్ మాస్టర్ నివాసంలో అభిమానుల సందర్శనార్థం పార్థివదేహాన్ని ఉంచనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ఇటీవల కరోనా బారినపడిన శివశంకర్ మాస్టర్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచే ఆయన పరిస్థితి విషమంగా ఉందన్న వార్తలు వచ్చాయి. తమిళ హీరో ధనుష్, బాలీవుడ్ నటుడు సోనూ సూద్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తదితరులు శివశంకర్ మాస్టర్ చికిత్స కోసం విరాళాలు కూడా అందజేశారు. అటు అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా శివశంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

Stop Charging Phones : ఆఫీసులో మొబైల్ ఛార్జింగ్ పెడితే..జీతం కట్!

అయితే అందరినీ విషాదానికి గురిచేస్తూ శివశంకర్ మాస్టర్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కూడా కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. శివశంకర్ మాస్టర్ భార్య కూడా కరోనా బారిన పడ్డారు. శివశంకర్ మాస్టర్ చిన్న కొడుకు వారి బాగోగులు చూసుకుంటున్నాడు.

శివశంకర్ మాస్టర్ వయసు 72 సంవత్సరాలు. 1975 నుంచి ఆయన సినీ రంగంలో కొనసాగుతున్నారు. తమిళ, తెలుగు చిత్రాలతో సహా 10 భాషల్లోని 800లకు పైగా చిత్రాల్లో పాటలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. అత్యధికంగా దక్షిణాది భాషా చిత్రాలకు పనిచేశారు. 1975లో ‘పాట్టు భరతమమ్‌’ చిత్రానికి సహాయకుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన ‘కురువికూడు’ చిత్రంతో నృత్య దర్శకుడిగా మారారు. కేవలం కొరియోగ్రాఫర్‌గానే కాదు, నటుడిగా వెండితెరపైనా తనదైన ముద్రవేశారు. 2003లో వచ్చి ‘ఆలయ్‌ ’చిత్రంతో నటుడిగా మారిన శివ శంకర్‌ మాస్టర్‌ దాదాపు 30కి పైగా చిత్రాల్లో వైవిధ్య నటనతో నవ్వులు పంచారు.

టెలివిజన్ రంగంలోనూ తనదైన ముద్రవేశారు. పలు షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఆయన దగ్గర శిష్యరికం చేసిన ఎంతో మంది ప్రస్తుతం టాప్‌ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్నారు. శివ శంకర్‌కు ఇద్దరు కుమారులు. విజయ్‌ శివ శంకర్‌, అజయ్‌ శివ శంకర్‌. ఇద్దరూ డ్యాన్స్‌ మాస్టర్లే.