Shiva Jyothi : మీకో దండంరా బాబు నేను ప్రెగ్నెంట్ కాదు..

ఇటీవల శివజ్యోతి ప్రెగ్నెంట్ అంటూ కొంతమంది వార్తలు రాశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆమె ప్రగ్నెంట్ అంటూ వీడియోలు చేసి పెట్టారు. దీంతో ఇవన్నీ చూసి సీరియస్ అయిన శివజ్యోతి.........

Shiva Jyothi : మీకో దండంరా బాబు నేను ప్రెగ్నెంట్ కాదు..

Shiva Jyothi

Shiva Jyothi :  సావిత్రిగా న్యూస్ ఛానెల్ లో బాగా పాపులర్ అయి బిగ్ బాస్ వరకు వెళ్ళింది యాంకర్ శివజ్యోతి. ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక మరింత పాపులర్ అయింది. ఒక పక్క న్యూస్ ఛానల్ లో యాంకర్ గా చేస్తూనే మరో పక్క టీవీ షోలు చేస్తుంది. ఇక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి తనకి సంబంధించిన వీడియోలు అన్ని పోస్ట్ చేస్తుంది. అయితే ఇటీవల శివజ్యోతి ప్రెగ్నెంట్ అంటూ కొంతమంది వార్తలు రాశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆమె ప్రగ్నెంట్ అంటూ వీడియోలు చేసి పెట్టారు. దీంతో ఇవన్నీ చూసి సీరియస్ అయిన శివజ్యోతి వీటిపై స్పందించింది.

తాను ప్రెగ్నెంట్ అన్న వార్తలపై స్పందిస్తూ ఓ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో.. ”నా గురించి నాకు తెలియకుండానే వార్తలు వస్తున్నాయి. నేను ఇటీవల ఓ ఈవెంట్‌కి వెళితే అక్కడ మామిడికాయతో ఫోటో పెట్టా. అంతే అప్పట్నుంచి నేను ప్రెగ్నెంట్‌ అంటూ ఫేక్‌న్యూస్‌ సృష్టిస్తున్నారు. వ్యూస్‌ కోసం కక్కుర్తి పడి ఇష్టం వచ్చినట్లు థంబ్‌నైల్స్‌ వేస్తున్నారు. ఇది పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా నాపై చాలా ఎఫెక్ట్‌ చూపిస్తుంది.”

Tamil Movies: ఒకే కథను అరగదీస్తున్న దర్శకులు.. వాళ్ళకే ఓటేస్తున్న హీరోలు!

”మాకు పెళ్లయి చాలా సంవత్సరాలు అయ్యింది. పిల్లల కోసం మా ఫ్యామిలీ అంతా ఎదురుచూస్తుంది. మీరు చేసే ఈ పని ఎంత ఎమోషనల్‌గా బాధపెడుతుందో మీకు తెలీదు. నేను ప్రెగ్నెంట్‌ అంటూ మీరు ప్రచారం చేసిన వార్తలు చూసి నేను ఈవెంట్స్ చేయనేమో అని నన్ను అడగడం కూడా మానేస్తున్నారు, దీంతో నా వర్క్ కూడా దెబ్బతింటుంది. అందుకే ఇలా వీడియో చేస్తున్నా. ప్లీజ్‌ ప్రెగ్నెన్సీ అన్నది నా జీవితంలో చాలా పెద్ద విషయం. నిజంగా నా లైఫ్‌లో ఆ గుడ్‌న్యూస్‌ ఉంటే నేనే మీ అందరికి చెప్తాను. అంతేకాని ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేయకండి” అంటూ తెలిపింది.