వెన్నెలగా శివానీ రాజశేఖర్..

  • Published By: sekhar ,Published On : July 1, 2020 / 03:19 PM IST
వెన్నెలగా శివానీ రాజశేఖర్..

ఒక ఫాంట‌సీ ల‌వ్ స్టోరీ చిత్రంలో వెన్నెల అనే క్యూట్ రోల్‌లో శివానీ రాజ‌శేఖ‌ర్ కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రం ద్వారా బాల‌న‌టుడిగా ప‌లు చిత్రాల్లో న‌టించి, సూప‌ర్ హిట్ సినిమా ‘ఓ బేబీ’లో యంగ్ యాక్ట‌ర్‌గా ఆక‌ట్టుకున్న తేజ స‌జ్జా ఈ న్యూ ఏజ్ ల‌వ్ స్టోరీతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. జూలై 1 శివానీ బ‌ర్త్‌డే సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని సినిమాలో ఆమె పోషిస్తోన్న క్యారెక్ట‌ర్ ప‌రిచ‌య పోస్ట‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది.

టాలీవుడ్ ప్ర‌ముఖ న‌టులు రాజ‌శేఖ‌ర్‌, జీవితా రాజ‌శేఖ‌ర్‌ల పెద్ద కుమార్తె అయిన శివానీ ఆ పోస్ట‌ర్‌లో మ‌న ప‌క్కింటి అమ్మాయి త‌ర‌హా లుక్‌లో ఆక‌ట్టుకునేలా ఉంది. చుడీదార్ ధ‌రించి, గోడ మీద కూర్చొని ఆకాశంలోని నెల‌వంక‌ను చూపిస్తోన్న ఆమె అపురూప లావ‌ణ్యంతో మెరిసిపోతుంది. ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకొని సెల్‌ఫోన్‌లో ఏవో వింటూ స‌రిగ్గా పాత్ర పేరు వెన్నెల‌కు త‌గ్గ‌ట్లుగా ఆమె క‌నిపిస్తుంది.

Shivani Rajashekar

మూడు సీజ‌న్లు ర‌న్ అయిన ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్‌తో అంద‌రి దృష్టినీ త‌న‌వైపు తిప్పుకున్న మ‌ల్లిక్ రామ్ ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఇంట్ర‌డ్యూస్ అవుతున్నారు.
యు.ఎస్‌.కు చెందిన‌ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ ఎస్ ఒరిజిన‌ల్స్, మ‌హాతేజ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్ర‌స్తుతం సెట్స్ మీదున్న ఈ మూవీ తారాగ‌ణం, ఇత‌ర వివ‌రాల‌ను ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌తో త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. అడివిశేష్ హీరోగా ‘2స్టేట్స్’ చిత్రం ద్వారా శివాని హీరోయిన్‌గా ప‌రిచ‌యం కావాల్సింది కానీ..ఆ సినిమా కొన్ని కార‌ణాల‌తో ఆగిపోయింది. కాస్త గ్యాప్ త‌ర్వాత శివాని డెబ్యూ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Read:పాపులర్ నటికి కరోనా పాజిటివ్..