Shivani Rajashekar : చదువు కోసం మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకున్న శివాని రాజశేఖర్..

మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ అందుకు గల కారణాలు తెలిపింది శివాని రాజశేఖర్. దీనిపై సోషల్ మీడియాలో..............

Shivani Rajashekar : చదువు కోసం మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకున్న శివాని రాజశేఖర్..

Shivani

Shivani Rajashekar :  హీరో రాజశేఖర్ కూతురిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది శివాని. అద్భుతం సినిమాతో ఎంట్రీ ఇచ్చి తర్వాత వరుస సినిమాలు, సిరీస్ లు చేస్తుంది. ఇటీవల తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మిస్ ఇండియా పోటీలలో పాల్గొంది శివాని. దీంతో చాలా మంది శివానికి సపోర్ట్ ఇచ్చారు. దాదాపు ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళింది శివాని. అయితే అనూహ్యంగా చివరి దశలో గ్రాండ్ ఫైనల్ మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకుంది శివాని రాజశేఖర్.

ఈ మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ అందుకు గల కారణాలు తెలిపింది శివాని రాజశేఖర్. దీనిపై సోషల్ మీడియాలో..”నాకు మెడికల్‌ థియరీ పరీక్షలు ప్రీ పోన్ అవ్వడంతో, అలాగే నాకు మలేరియా రావడం వల్ల నేను మిస్ ఇండియా ఫైనల్ పోటీలలో పాల్గొనలేకపోతున్నాను. ఇక్కడివరకు వచ్చి ఫైనల్ లో పాల్గొనాలని ప్రయత్నించినా కుదరడంలేదు. నా ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌ అనుకున్న తేదీ కంటే ముందుగానే మొదలయ్యాయి. ‘మిస్‌ ఇండియా గ్రాండ్‌ ఫినాలే’ ఫైనల్ జులై 3న కూడా నాకు ఎగ్జామ్‌ ఉంది. అందువల్ల మిస్‌ ఇండియా ప్రయాణాన్ని కొనసాగించలేకపోతున్నాను. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం నా ఆరోగ్యం కోలుకుంటుంది. నేను పరీక్షల నిమిత్తం ప్రస్తుతం గుంటూరులో ఉన్నాను” అని శివాని ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.

Raashii Khanna : నాకు కామెడీ కంటే హీరోలతో రొమాన్స్ చేయడం చాలా ఈజీ..

శివాని తప్పుకోవడాంతో ఈ సారి తమిళనాడు నుంచి మిస్ ఇండియా పోటీలలో ఫైనల్ లో ఎవరూ లేరు. దీనిపై అభిమానులు చాలా నిరాశ చెందారు. ఇక కొంతమంది చదువు ముఖ్యం, దాని కోసం ఈ పోటీలలో తప్పుకోవడం మంచి నిర్ణయం అని కామెంట్స్ చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని కూడా కోరుకుంటున్నారు. కుదిరితే శివాని వచ్చేసారి మళ్ళీ మిస్ ఇండియా పోటీలలో పాల్గొనే అవకాశం ఉంది.