Shivani Rajashekar : నా వల్ల నాన్నకి కరోనా వచ్చింది.. నా జాతకంలో దోషం ఉందని అందరూ అనేవారు..

శేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాని రాజశేఖర్ మాట్లాడుతూ.. ''సినిమా మొదలు పెట్టే సమయానికి నా వల్ల నాన్నకి కోవిడ్ వచ్చింది. నా వల్ల తను చాలా సిక్ అయ్యాడు. ఒకానొక టైంలో డాక్టర్స్ వచ్చి.......................

Shivani Rajashekar : నా వల్ల నాన్నకి కరోనా వచ్చింది.. నా జాతకంలో దోషం ఉందని అందరూ అనేవారు..

Shivani Rajashekar :  రాజశేఖర్ హీరోగా, శివాని ముఖ్యపాత్రలో తెరకెక్కిన సినిమా శేఖర్. మలయాళం సూపర్ హిట్ సినిమా ‘జోసెఫ్’కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాని జీవితా రాజశేఖర్ తెరకెక్కించారు. శేఖర్ సినిమా మే 20న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి శేఖర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని హోటల్ దసపల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డైరెక్టర్ సుకుమార్ విచ్చేశారు.

Jeevitha Rajashekar : నేనెవరినీ మోసం చేయలేదు.. నా సినిమాకి టికెట్ రేట్లు కూడా పెంచను..

 

శేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాని రాజశేఖర్ మాట్లాడుతూ.. ”ఈ సినిమా ఈవెంట్ కు వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అనూప్ గారు చాలా మంచి సాంగ్స్, డిఓపి గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. మా నిర్మాతలు రాలేకపోయినా వాళ్ళు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. సినిమా మొదలు పెట్టే సమయానికి నా వల్ల నాన్నకి కోవిడ్ వచ్చింది. నా వల్ల తను చాలా సిక్ అయ్యాడు. ఒకానొక టైంలో డాక్టర్స్ వచ్చి చాలా సీరియస్ గా ఉంది, వెంటిలేటర్ పైన పెట్టే ఛాన్సులు ఉన్నాయి అన్నారు. దాంతో అందరూ నీ జాతకంలో దోషం ఉందేమో అనే వారు. ఆరు సంవత్సరాల నుండి నా సినిమా రిలీజ్ అవ్వకపోవడం, ఇప్పుడు నా వల్ల మా ఫ్యామిలీకి కోవిడ్ రావడం.. ఇవన్నీ నా వల్లే అని అన్నారు. కానీ మా డాడీ నన్ను సపోర్ట్ చేశాడు. మాకు మా అమ్మ, నాన్నలు దొరకడం దేవుడిచ్చిన వరం. మా కోసం కాకుండా మా నాన్న ప్రేక్షకుల కోసం పునర్జన్మలా తిరిగి వచ్చి ఈ సినిమా చేశారు. అందుకోసమైనా ఈ సినిమా మా నాన్నకు గొప్ప విజయం ఇవ్వాలి” అంటూ ఎమోషనల్ అయింది.