Shivathmika Rajashekar : ఆ సినిమా చెయ్యొద్దన్నారు.. అవకాశాలు రావన్నారు.. రంగమార్తాండపై సంచలన వ్యాఖ్యలు చేసిన శివాత్మిక..

ఇటీవలే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకులని మెప్పించింది శివాత్మిక. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూతురిగా నటించి కొన్ని సన్నివేశాల్లో కన్నీళ్లు పెట్టించింది. రంగమార్తాండ మంచి విజయం...................

Shivathmika Rajashekar : ఆ సినిమా చెయ్యొద్దన్నారు.. అవకాశాలు రావన్నారు.. రంగమార్తాండపై సంచలన వ్యాఖ్యలు చేసిన శివాత్మిక..

Shivathmika Rajashekar comments on Rangamarthanda Movie

Shivathmika Rajashekar :  రాజశేఖర్(Rajashekar) కూతురిగా శివాత్మిక(Shivathmika) 18 ఏళ్లకే దొరసాని(Dorasani) సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో నటనతో, అందంతో ప్రేక్షకులని మెప్పించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోయినా తెలుగు, తమిళ్ లో కొన్ని చిన్న సినిమాలు చేసింది. ఓ హీరో కూతురిగా ఇలాంటి సినిమాలే చేస్తానని అనకుండా వచ్చిన అవకాశాల్లో మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది శివాత్మిక.

ఇటీవలే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకులని మెప్పించింది శివాత్మిక. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూతురిగా నటించి కొన్ని సన్నివేశాల్లో కన్నీళ్లు పెట్టించింది. రంగమార్తాండ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా శివాత్మిక ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది. అందులో రంగమార్తాండ సినిమా గురించి కూడా మాట్లాడింది.

శివాత్మిక మాట్లాడుతూ.. రంగమార్తాండలో నాది మెయిన్ లీడ్ కాదు, ఇది కమర్షియల్ సినిమా కూడా కాదు. చాలా మంది రంగమార్తాండ సినిమా చెయ్యొద్దు అన్నారు. ఆ సినిమా చేస్తే నీకు అవకాశాలు రావు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చెయ్యకు అన్నారు. ఇప్పుడు అలాంటి సినిమా ఎవరూ చూడరు అని అన్నారు. కానీ ఏమైంది ఆ సినిమా మంచి హిట్ అయి పేరు తీసుకువచ్చింది అని తెలిపింది.

Sai Pallavi : నేను అందుకే మేకప్ వేసుకోను.. అదే నాకు చాలా కాన్ఫిడెంట్ ఇచ్చింది..

అలాగే శివాత్మిక ఇదే ఇంటర్వ్యూలో.. దొరసాని సినిమా చేశాక బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేస్తాను, అందులోను హీరో కూతురిని కదా అని అనుకున్నాను. కానీ దొరసాని రిలీజయ్యాక సంవత్సరం పైగా ఒక్క సినిమా కూడా రాలేదు, అప్పుడు రియాలిటీలోకి వచ్చాను అని తెలిపింది. ఇక తన మేకప్ గురించి చెప్తూ.. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ మేకప్ వేసుకోలేదు, చాలా వరకు అన్ని నార్మల్ పాత్రలే కావడంతో డైరెక్టర్స్ కూడా మేకప్ వద్దన్నారు. నాకేమో మేకప్ వేసుకోవడం ఇష్టం. ఆకాశం సినిమాలో అయితే లిప్ స్టిక్ కూడా వేసుకోవద్దన్నారు అని తెలిపింది. ఇక తనకి కమర్షియల్ సినిమాలు, యాక్షన్ సినిమాల్లో హీరోయిన్ గా చేయాలని ఉందని, అలాగే నాన్న రాజశేఖర్ తో కూడా కలిసి వర్క్ చేయాలని ఉందని తెలిపింది.