James: పునీత్ పాత్రకి అన్న శివరాజ్ డబ్బింగ్.. కన్నీటి పర్యంతం!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. పునీత్ మరణాన్ని ఇప్పటికి ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

James: పునీత్ పాత్రకి అన్న శివరాజ్ డబ్బింగ్.. కన్నీటి పర్యంతం!

James

James: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. పునీత్ మరణాన్ని ఇప్పటికి ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చేసింది తక్కువ సినిమాల్లోనే అయినా పవర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న పునీత్.. ఇక సినిమాలకి మించి చేసిన అనేక సేవ కార్యక్రమాలు ఆయనను మహోన్నత వ్యక్తిగా నిలిపాయి. పునీత్ మరణానికి ముందు చివరగా యువరత్న సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

SS Rajamouli: ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఇచ్చారు.. కానీ సైలెంట్ ఎందుకు?

పునీత్ చనిపోయే సమయానికి జేమ్స్, ద్విత్వ అనే సినిమాలలో నటిస్తుండగా.. వీటిలో జేమ్స్ సినిమా షూటింగ్ పూర్తవగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. మార్చి 17న ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా.. ఈ సినిమాలో పునీత్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. పునీత్ చనిపోయే సమయానికి షూటింగ్ అయితే పూర్తయింది కానీ పునీత్ పాత్రకి డబ్బింగ్ మిగిలి ఉంది.

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ గేమ్ ప్లాన్.. ఓటీటీ కోసం మాజీ కంటెస్టెంట్లు?

దీంతో ముందుగా షూటింగ్ స్పాట్ లో రికార్డ్ చేసిన పునీత్ వాయిస్ ను సాంకేతిక పరిజ్ఞానంతో డెవలప్ చేసి రిలీజ్ చేయాలనున్నారు. కానీ అది అంతగా సెట్ కాలేదు. డబ్బింగ్ ఆర్టిస్ట్స్ తో ట్రై చేసినా వర్క్ అవుట్ కాలేదు. దీంతో పునీత్ పాత్రకి అన్న శివరాజ్ కుమార్ తో డబ్బింగ్ చెప్పించారట. డబ్బింగ్ థియేటర్ లో శివరాజ్ కుమార్ ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని కన్నీరు పెట్టుకున్నారట. ఈ సినిమా పునీత్ చివరి సినిమా కావడంతో ఇందులో పునీత్ అన్నలు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ కూడా నటించనున్నారట.