Balayya – Shiva Rajkumar : పునీత్ AV చూసి శివరాజ్ కుమార్ కన్నీరు.. బాలయ్య ఓదార్పు!

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన 'వేద' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ పై ఒక AV ప్లే చేశారు. ఆ AV ని చూసిన శివరాజ్ కుమార్ తీవ్ర భాగోద్వేగానికి లోనయ్యాడు. కన్నీరు పెట్టుకుంటున్న శివరాజ్ కుమార్ ని బాలకృష్ణ ఓదార్చి ధైర్యం చెప్పాడు.

Balayya – Shiva Rajkumar : పునీత్ AV చూసి శివరాజ్ కుమార్ కన్నీరు.. బాలయ్య ఓదార్పు!

Balayya - Shiva Rajkumar

Balayya – Shiva Rajkumar : కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘వేద’. గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం కన్నడనాట మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాని ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగులో ఈ చిత్రం ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న (ఫిబ్రవరి 7) హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.

Balakrishna : మొన్న చిరు, ఇవాళ బాలయ్య.. డైరెక్టర్లకు చురకలు!

కాగా ఈ ఈవెంట్ లో స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ పై ఒక AV ప్లే చేశారు. ఆ AV ని చూసిన శివరాజ్ కుమార్ తీవ్ర భాగోద్వేగానికి లోనయ్యాడు. కన్నీరు పెట్టుకుంటున్న శివరాజ్ కుమార్ ని బాలకృష్ణ ఓదార్చి ధైర్యం చెప్పాడు. ఆ తరువాత శివరాజ్ కుమార్ స్టేజి పై మాట్లాడుతూ.. ‘నేను ఎమోషనల్ అయ్యినందుకు సారీ. నేను కన్నీరు పెట్టుకోకూడదు అనుకుంటా. కానీ అప్పు బేబీ పేస్ చూసి కన్నీళ్లు వచేస్తుంటాయి. నాకు 13 ఏళ్ళ ఉన్న వయసులో వాడు పుట్టాడు. నాకు వాడు ఒక బేబీ లాంటి వాడు. అలాంటిది నాకంటే వాడు ముందు వెళ్లిపోవడం నాకు బాగా బాధని కలిగిస్తుంటుంది. ఏదేమైనా అప్పు ఎప్పుడు మనతోనే ఉంటాడు’ అంటూ వ్యాఖ్యానించాడు.

ఆ తరువాత బాలకృష్ణ కూడా పునీత్ గురించి మాట్లాడుతూ.. ‘పునీత్ రాజ్ కుమార్ మన మధ్య లేకపోయినా ఆయన స్థానం ఆయనదే, ఆయన స్థాయి ఆయనదే. పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కేవలం నటుడు గానే కాదు ఆయన సేవ గుణంతో గొప్ప వ్యక్తిగా అందరి హృదయాల్లో నిలిచిపోయారు. మనం ఏదైనా చేస్తే.. మేము ఇది చేసేసాం, అది చేసేసాం అని గొప్పలు చెప్పుకుంటాం. కానీ ఎటువంటి ఆర్బాటం లేకుండా ఆయన తృప్తి కోసం ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఆ సేవలే ఆయనని నేడు మన మధ్య చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.