Shobu Yarlagadda : బాహుబలి నిర్మాతలకి థ్యాంక్స్ చెప్పిన పఠాన్ చిత్రయూనిట్..

బాహుబలి 2 హిందీ బెల్ట్ లో 510 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అత్యధిక కలెక్షన్స్ ఉన్న సినిమాగా ఇన్ని రోజులు రికార్డ్ మెయింటైన్ చేసింది. తాజాగా పఠాన్ సినిమా 511 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి అయిదేళ్ల తర్వాత

Shobu Yarlagadda : బాహుబలి నిర్మాతలకి థ్యాంక్స్ చెప్పిన పఠాన్ చిత్రయూనిట్..

Shobu Yarlagadda tweet on pathaan crossing Bahubali hindi record and pathaan unit says thanks to Bahubali producers and rajamouli

Shobu Yarlagadda :  షారుఖ్, దీపికా జంటగా, జాన్ అబ్రహం విలన్ గా, సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా మంచి విజయం సాధించి, చాలా రోజుల తర్వాత బాలీవుడ్ లో హిట్ టాక్ తెచ్చుకొని భారీ కెల్క్షన్స్ సాధించింది. ఈ సినిమాతో చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత షారుఖ్ హిట్ కొట్టడమే కాకుండా గత సంవత్సర కాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న బాలీవుడ్ కి పెద్ద విజయాన్ని అందించాడు. ఈ సినిమా ఇప్పటికే 1033 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది.

పఠాన్ సినిమా బాహుబలి 2, KGF 2, RRR సినిమాల ఓవరాల్ కలెక్షన్స్ దాటిద్దామనుకున్నా అది అయ్యేలా లేదు. కానీ లోకల్ గా హిందీ సినిమాల రికార్డులని మాత్రం దాటించింది. సింగిల్ రిలీజ్ లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్, షేర్ కలెక్షన్స్ సాధించిన హిందీ సినిమాగా సరికొత్త రికార్డ్ సాధించింది. బాహుబలి 2 హిందీ బెల్ట్ లో 510 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అత్యధిక కలెక్షన్స్ ఉన్న సినిమాగా ఇన్ని రోజులు రికార్డ్ మెయింటైన్ చేసింది. తాజాగా పఠాన్ సినిమా 511 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి అయిదేళ్ల తర్వాత బాహుబలి 2 రికార్డులని హిందీలో బద్దలుకొట్టింది. ఈ విషయంలో బాలీవుడ్ సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు హిందీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా పఠాన్ నిలవగా బాహుబలి 2 రెండో ప్లేస్ లో నిలిచింది.

Ravanasura : సీతని తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు రావణాసురుడ్ని దాటాలి.. రావణాసుర టీజర్ రిలీజ్.. రవితేజ నెగిటివ్ రోల్?

దీనిపై బాహుబలి చిత్రనిర్మాత ట్వీట్ చేస్తూ.. పఠాన్ చిత్రయూనిట్ అందరికి కంగ్రాట్స్. రికార్డ్ అంటేనే బద్దలు కొట్టాలి. బాహుబలి రికార్డ్ ని షారుఖ్ దాటినందుకు సంతోషంగా ఉంది అని తెలిపాడు. తన సినిమా రికార్డుని బద్దలుకొట్టినా అవతలి సినిమా వాళ్ళని అభినందించడంతో అందరూ శోభుని అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శోభు ట్వీట్ ని పఠాన్ నిర్మాణ సంస్థ యష్ రాజా ఫిలిమ్స్ షేర్ చేస్తూ.. ఇండియన్ సినిమా అభివృద్ధి చెందడం కన్నా ఇంకో థ్రిల్లింగ్ విషయం లేదు. మీకు, రాజమౌళి గారికి బాహుబలి లాంటి సినిమా ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆ సినిమా మాకు ఒక ల్యాండ్ మార్క్ సెట్ చేసి మమ్మల్ని ఇంకా కష్టపడేలా చేసింది అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.