Kapil Biopic 83: రణవీర్, దీపికాకు షాక్.. నిర్మాతలపై చీటింగ్ కేస్!

1983 నాటి ఇండియా తొలి క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ నేప‌థ్యంలో తెర‌కెక్కించిన చిత్రం 83. స్టార్ హీరో ర‌ణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనె న‌టించిన ఈ మూవీని క‌బీర్ ఖాన్ తెర‌కెక్కించాడు.

Kapil Biopic 83: రణవీర్, దీపికాకు షాక్.. నిర్మాతలపై చీటింగ్ కేస్!

83 Film

Kapil Biopic 83: 1983 నాటి ఇండియా తొలి క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ నేప‌థ్యంలో తెర‌కెక్కించిన చిత్రం 83. స్టార్ హీరో ర‌ణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనె న‌టించిన ఈ మూవీని క‌బీర్ ఖాన్ తెర‌కెక్కించాడు. నవంబర్ 30న విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించగా.. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కాబోతోంది. మరో రెండు వారాలలో రిలీజ్ కానున్న ఈ సినిమా నిర్మాతలపై చీటింగ్ కేస్ నమోదు చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫైనాన్షియల్ కంపెనీ అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది.

Pushpa- Samantha: దీపాలన్నీ ఆర్పేశాక.. ఊ.. ఊఊ.. సామ్ స్పెషల్ ట్రీట్! పాట విడుదల

పెట్టుబడులు పెట్టే ఉద్దేశ్యంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫైనాన్షియల్ కంపెనీ 83 సినిమా నిర్మాతలను కలవగా వారు పాజిటివ్ గా స్పందించి అగ్రిమెంట్స్ చేసుకున్నారు. సినిమా హక్కులు ఇప్పిస్తామని రూ.15.90 కోట్లు ఖర్చు చేయించి, చివరికి హక్కులు ఇవ్వకుండా తమను మోసం చేశారని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫైనాన్షియల్ కంపెనీ అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చిత్ర నిర్మాతలపై ఐపీసీ 406, 420, 120బీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరారు.

Chiru 154: బాబీ సినిమాకీ లీకుల బెడద.. వాల్తేరు శీనయ్య కథ ఇదేనా?

తమ కంపెనీతో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం సినిమా ఆర్థిక లావాదేవీల్లో తమను ఇన్వాల్వ్ చేయకుండా నిర్మాతలు తనను మోసం చేశారని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫైనాన్షియల్ కంపెనీ కోర్టుకెక్కింది. ఈ సినిమాను దీపికా పదుకొనె, కబీర్‌ ఖాన్, విష్ణు ఇందూరి, సాజిద్‌ నడియాడ్‌వాలా, ఫాంటమ్‌ ఫిలిమ్స్, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, 83 ఫిలిమ్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా నిర్మించగా ఇప్పుడు ఈ చిక్కు నుండి ఎలా తప్పించుకుంటారో చూడాల్సి ఉంది.