హీరోయిన్ నైనా గంగూలీ కాళ్లపై రామ్ గోపాల్ వర్మ

  • Published By: vamsi ,Published On : December 31, 2019 / 01:16 AM IST
హీరోయిన్ నైనా గంగూలీ కాళ్లపై రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ.. ఒక్క మాటలో చెప్పాలంటే కాంట్రవర్శీ కింగ్.. వివాదాలకు కేరాఫ్.. అయితే దర్శకుడిగా మాత్రం వర్మ సృష్టించిన సినిమాలు ట్రెండ్ సెట్టర్ సినిమాలు. దర్శకుడిగా ఆయన ఓ ప్ర‌భంజ‌నం. ఆయ‌ను చూసి, ఆయ‌న తీసిన సినిమాలకు ఇన్‌స్పైర్ అయ్యి ద‌ర్శ‌కులు కావాలనే ఆశ‌లతో గుండెల నిండా సినిమాని నింపుకుని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో దిగిపోయిన కుర్రకారు ఎందరో.. 

అటువంటి వర్మ ఇటీవలకాలంలో వరుసగా తీస్తున్నవి ఫ్లాపు సినిమాలే.. కేవలం కాంట్రవర్శీ సబ్జెక్టులే.. అయినా కూడా ఆయన మాట తీరును ప్రేమించేవారు ఉన్నారు. ఆయనను ఆరాధించేవారు ఉన్నారు. అయితే అటువంటి అభిమానులు సైతం రామ్ గోపాల్ వర్మ చేసిన పనికి కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ‘బ్యూటిఫుల్‌’ సినిమా ప్రమోషన్ చెయ్యడానికి వర్మ ప‌డుతున్న తంటాలు అంతా ఇంతా కాదు.

ఇటీవల ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో వ‌ర్మ చేసిన డాన్సులు, వ‌చ్చీ రానీ మూమెంట్స్‌తో న‌వ్వించాడు. కాక‌పోతే అది వ‌ర్మ‌లో కొత్త కోణం. హుందాత‌నం ప‌క్క‌న పెట్టేసి తాగడం, తినడాన్ని కూడా వర్మ లైవ్‌లో పెట్టేశాడు. ఓ ప్రైవేటు పార్టీని లైవ్ లో చూపించేశాడు వ‌ర్మ‌. ఆ పార్టీలో వ‌ర్మ తాగుతూ, తూలుతూ.. హీరోయిన్ నైనా గంగూలీతో విన్యాసాలు చేసేశాడు. ఓ సంద‌ర్భంలో నైనా గంగూలీ కాళ్ల‌పై ప‌డిపోయాడు కూడా. ఈ విషయం పైనే రామ్ గోపాల్ వర్మను విమర్శించేవాళ్లు కనిపిస్తున్నారు.