Telugu Upcoming Movies: హీరోయిన్ల కొరత.. అప్షన్లు తెగ వెతికేస్తున్న మేకర్స్!

హీరోలు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలైతే కమిట్ అవుతున్నారు కానీ.. హీరోయిన్ల కోసం మాత్రం చాలా ఆప్షన్లు చూస్తున్నారు. ఉన్నది తక్కువ మంది హీరోయిన్లే కాబట్టి కాంబినేషన్స్ రిపీట్ కాకుండా..

Telugu Upcoming Movies: హీరోయిన్ల కొరత.. అప్షన్లు తెగ వెతికేస్తున్న మేకర్స్!

Telugu Upcoming Movies

Telugu Upcoming Movies: హీరోలు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలైతే కమిట్ అవుతున్నారు కానీ.. హీరోయిన్ల కోసం మాత్రం చాలా ఆప్షన్లు చూస్తున్నారు. ఉన్నది తక్కువ మంది హీరోయిన్లే కాబట్టి కాంబినేషన్స్ రిపీట్ కాకుండా హీరోయిన్లను సెట్ చెయ్యడం పెద్ద సమస్య అయిపోయింది మేకర్స్ కి. రిపీట్ చెయ్యొద్దని హీరోయిన్ల కోసం బాలీవుడ్ వైపు వెళుతున్నారు మనవాళ్లు. ఇలా ఈ హీరో పక్కన ఆ హీరోయిన్ నటిస్తోందంటూ రకరకాల రూమర్స్ నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. ఇంతకీ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఎవరికొస్తుంది..?

Upcoming Movies: ఒక హీరో కోసం రాసిన కథ.. మరో హీరోతో సినిమా!

వరసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు హీరోలు. కొత్త సినిమాతో పాటు స్టార్ కాస్ట్ ని, స్పెషల్లీ హీరోయిన్ ని కూడా అనౌన్స్ చేస్తుంటే.. కొంతమంది మాత్రం.. ఇంకా హీరోయిన్ ని ఫిక్స్ చేద్దామా అని ఆలోచిస్తున్నారు. దాంతో తమ హీరో పక్కన ఏ హీరోయిన్ బావుంటుందా అని ఇమాజిన్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు ఫాన్స్. లేటెస్ట్ గా ఎన్టీఆర్ సినిమాకి హీరోయిన్ గా ఎవరా అని తెగ బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు.

Upcoming Movies: ఒక్క టీజర్.. శాంపిల్‌తోనే సినిమా చూపించేస్తున్న మేకర్స్!

ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో రష్మిక అన్నారు.. పూజాహెగ్డే అన్నారు.. ఆఖరికి జాన్వీ కపూర్ అన్నారు.. కానీ ఆఖరికి ఆలియా భట్ హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయింది. అయితే ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చెయ్యబోతున్న బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి సంబంధించి హీరోయిన్ గా ఛాన్స్ ఎవరికొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు అందరూ. ప్రశాంత్ పాన్ ఇండియా లెవల్ మూవీ కాబట్టి.. దీపికా పదుకోన్ ని ఎన్టీఆర్ కు హీరోయిన్ గా సెట్ చేస్తాడంటూ టాక్ నడుస్తోంది. మరో వైపు జాన్వికపూర్ అని కూడా రూమర్స్ నడుస్తున్నాయి. మరి ఈ ఇద్దరిలో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే చాన్స్ ఎవరికి దక్కుతుందో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.

Upcoming Movies : ఈ సినిమాలన్నీ పూర్తయ్యేదెప్పుడు..?

రామ్ చరణ్ కూడా నెక్టస్ తన సినిమాలో హీరోయిన్ గా ఎవర్ని ఫిక్స్ చేస్తారా అని ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తోంది. శంకర్ సినిమాలో ఆల్రెడీ కియారాతో రెండో సారి సినిమా చేస్తున్నాడు చరణ్. మరి తర్వాత గౌతమ్ తిన్ననూరితో చెయ్యబోయే సినిమాలో హీరోయిన్ గా ఎవరికి ఛాన్స్ దక్కొచ్చు అంటూ స్పెక్యులేషన్స్ స్టార్ట్ చేశారు ఫాన్స్. పూజాహెగ్డే, కియారాతో సినిమాలు చేస్తున్న చరణ్.. గౌతమ్ సినిమాలో హీరోయిన్ గా రష్మికకు ఛాన్స్ ఇస్తున్నారంటూ టాక్.

Pan India Movies: మారిన ఆడియన్స్ టేస్ట్.. మెప్పించడం అంత ఈజీకాదు!

మహేష్ బాబు సినిమాలో కూడా హీరోయిన్ నిఫిక్స్ చెయ్యడానికి వెతుకుతున్నారు. రాజమౌళి-మహేష్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో మహేష్ కు జంటగా ఆలియా భట్ ని తీసుకనే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. ట్రిపుల్ఆఱ్ లో ఆలియాతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ నచ్చడంతో పాటు.. రాజమౌళితో సినిమాకు ఎప్పుడైనా రెడీయే అన్న ఆలియా.. మహేష్ తో సినిమా అంటే గ్యారంటీగా ఓకే చెబుతుందంటున్నారు ఫాన్స్.

High Budget Movies: నిర్మాతలకు షాక్ కొట్టే సినిమా బడ్జెట్.. ఎందుకిలా పెరిగిపోతుంది?

ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ అన్నింటిలో హీరోయిన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే తన కెరీర్ లో 25వ సినిమాగా చేస్తున్న సందీప్ వంగా మూవీలో హీరోయిన్ ని మాత్రం ఇంకా అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్లో సినిమాలు చేస్తున్న ప్రభాస్ నెక్ట్స్ తన పాన్ వరల్డ్ మూవీకి ఏ హీరోయిన్ తో జత కడతారో అని వెయిట్ చేస్తున్నారు ఫాన్స్.