Tollywood Stars: హీరోయిన్ల కొరత.. సినిమాలున్నా స్టార్ హీరోల వెయిటింగ్!

అసలే కోవిడ్ తో సినిమాలకు గ్యాప్ వచ్చేసింది..ఇక టైమ్ వేస్ట్ చెయ్యకూడదని హీరోలు వరసగా సినిమాలు కమిట్ అవుతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలైతే కమిట్ అవుతున్నారు కానీ.. హీరోయిన్లకోసం..

Tollywood Stars: హీరోయిన్ల కొరత.. సినిమాలున్నా స్టార్ హీరోల వెయిటింగ్!

Tollywood Stars

Tollywood Stars: అసలే కోవిడ్ తో సినిమాలకు గ్యాప్ వచ్చేసింది..ఇక టైమ్ వేస్ట్ చెయ్యకూడదని హీరోలు వరసగా సినిమాలు కమిట్ అవుతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలైతే కమిట్ అవుతున్నారు కానీ.. హీరోయిన్లకోసం మాత్రం వెయిట్ చెయ్యకతప్పడం లేదు. ఉన్నది తక్కువ మంది హీరోయిన్లే కాబట్టి కాంబినేషన్స్ రిపీట్ కాకుండా హీరోయిన్లను సెట్ చెయ్యడం పెద్ద సమస్య అయిపోయింది మేకర్స్ కి. ఇలా హీరోయిన్ల కోసం వెయిట్ చేస్తున్న హీరోలెవరో చూద్దాం.

Tollywood Actress: ముంబైలో తెగ సందడి చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్!

వరసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు హీరోలు. కొత్త సినిమాతో పాటు స్టార్ కాస్ట్ ని, స్పెషల్లీ హీరోయిన్ ని కూడా అనౌన్స్ చేస్తుంటే.. కొంతమంది మాత్రం.. ఇంకా హీరోయిన్ ని ఫిక్స్ చెయ్యకుండా వెతుక్కుంటున్నారు. ప్రభాస్ వరసగా 5 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ 4 సినిమాల షూటింగ్ తో ఫుల్ బిజీగా కూడా ఉన్నారు. తన కెరీర్ లో 25వ సినిమాగా చేస్తున్న సందీప్ వంగా మూవీలో హీరోయిన్ ని మాత్రం ఇంకా అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్లో సినిమాలు చేస్తున్న ప్రభాస్ నెక్ట్స్ ఏ హీరోయిన్ తో జత కడతారో అని వెయిట్ చేస్తున్నారు ఫాన్స్.

Tollywood Love Stories: అంతా ప్రేమమయం.. ప్రేమలో మునిగితేలుతున్న టాలీవుడ్!

ఎన్టీఆర్ ట్రిపుల్ఆర్ తర్వాత అనౌన్స్ చేసిన రెండు సినిమాలకు హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. ఎన్టీఆర్ కొరటాలతో చెయ్యబోతున్న సినిమాలో హీరోయిన్ గా కియారా, పూజా, జాన్వి, పేర్లు వినిపించినా లాస్ట్ కి ఆలియా ఫిక్స్ అయినట్టు వార్తలొస్తున్నాయి. అయితే టీమ్ మాత్రం అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యలేదు. ఇక ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ అనౌన్స్ చేసిన సినిమాలో కడా హీరోయిన్ సెలక్ట్ అవ్వాల్సి ఉంది.

Tollywood : సిల్వర్ స్క్రీన్‌పై జాతర.. బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు

రామ్ చరణ్ ఇప్పుడు ట్రిపుల్ ఆర్, ఆచార్య సినిమాల రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు శంకర్ సినిమా షూట్ ని కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో అనౌన్స్ చేసిన సినిమాలో హీరోయిన్ గా ఇంకా ఎవర్నీ ఫిక్స్ చెయ్యలేదు టీమ్. రౌడీ హీరో విజయ్ దేవరకొండకి కూడా హీరోయిన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సుకుమార్ తో అనౌన్స్ చేసిన సినిమాతో పాటు లేటెస్ట్ గా పూరీతో చేస్తున్న మరో సినిమా జనగణమనలో కూడా హీరోయిన్ ఫిక్స్ చెయ్యాల్సి ఉంది.

Tollywood : టాలీవుడ్‌లో ఫుల్ జోష్.. విడుదలకు క్యూ కడుతున్న పెద్ద సినిమాలు..

సీనియర్ హీరోలకి హీరోయిన్లు దొరకడం ఇంకా కష్టమైపోతోంది. చిరంజీవి కమిట్ అయిన 5 సినిమాల్లో.. బాబీ, వెంకీ కుడుముల సినిమాలకు హీరోయిన్లు దొరకలేదు. ఇక పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా హీరోయిన్ ఫిక్స్ కావాల్సి ఉంది. ఇలా సినిమాలైతే అనౌన్స్ చేస్తున్నారు.. కానీ హీరోయిన్ల కోసం మాత్రం వెయిట్ చెయ్యక తప్పడం లేదు.