Shreya Goshal: ట్విట్టర్ సీఈఓతో రిలేషన్‌పై శ్రేయా ఘోషల్ ట్వీట్

ట్విట్టర్ కొత్త సీఈఓ పరాగ్ అగ్రవాల్ తో రిలేషన్ గురించి శ్రేయా గోషల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోషల్ మీడియాలో వారిద్దరిపై వస్తున్న ట్రోల్స్ ను స్పోర్టీవ్ గా తీసుకున్న ఆమె..

Shreya Goshal: ట్విట్టర్ సీఈఓతో రిలేషన్‌పై శ్రేయా ఘోషల్ ట్వీట్

Shreyas Goshal

Shreya Goshal: ట్విట్టర్ కొత్త సీఈఓ పరాగ్ అగ్రవాల్ తో రిలేషన్ గురించి శ్రేయా గోషల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోషల్ మీడియాలో వారిద్దరిపై వస్తున్న ట్రోల్స్ ను స్పోర్టీవ్ గా తీసుకున్న ఆమె.. అప్పుడు మేం చిన్నపిల్లలమంటూ అప్పటి ట్వీట్లు తీసి ఇప్పుడు వైరల్ చేస్తున్నారని పోస్టు పెట్టారు.

రీసెంట్ గా ట్విట్టర్ కొత్త CEO అయినందుకు పరాగ్ అగ్రవాల్‌ను శ్రేయా గోషల్ అభినందించారు. అలా జరిగిన కొద్ది గంటల్లోనే ట్రోలింగ్ మొదలైంది. “అభినందనలు @పరాగ్ చాలా గర్వంగా ఉంది!! మనకు ఇది గొప్ప క్షణం,” అని ట్విట్టర్ ప్రకటనకు క్యాప్షన్ ఇచ్చారు.

ట్వీట్ చేసిన వెంటనే ట్రోలింగ్ మొదలైన కాసేపటికే.. ‘అరే యార్.. మీరంతా చిన్నప్పటి ట్వీట్లను కూడా బయటకు తీస్తున్నారా.. 10ఏళ్ల క్రితం ట్విట్టర్ అప్పుడే లాంచ్ అయింది. అప్పుడే మా కెరీర్స్ స్టార్ట్ చేశాం. ఫ్రెండ్స్ ఒకరికొకరు ట్వీట్స్ చేసుకోకుండా ఉంటారా.. ఏం టైం పాస్ చేస్తున్నార్రా బాబు’ అని ట్వీట్ ద్వారా ట్రోలింగ్ పై రెస్పాండ్ అయ్యారు.

………………………………………………: ఆ నలుగురు.. ముంబై రిటైన్ చేసుకుంది వారినే!

శ్రేయా ఘోషల్ పదేళ్ల క్రితం చేసిన మరో ట్వీట్ కూడా వైరల్ అవుతుంది. “అందరికీ హాయ్!! మరో చిన్నప్పటి దోస్ కలిశాడు!! స్టాన్‌ఫోర్డ్ స్టూడెంట్! పుట్టినరోజు సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలియజేయండి, ప్లీజ్” అని ఘోషాల్ మే 2010లో ట్వీట్ చేశారు.

జాక్ డోర్సీ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించడంతో పరాగ్ అగర్వాల్ సోమవారం ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ముంబైలో జన్మించిన అగర్వాల్ IIT-బాంబే స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి.

……………………………………….. : వామ్మో.. ఢిల్లీ టు న్యూయార్క్ టికెట్ ధర రూ.6 లక్షలు.. భారీగా పెరిగిన విమాన ప్రయాణ ఛార్జీలు