Shriya : సినిమా చూడటానికి ఆటోలో వచ్చిన శ్రియ

ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా సరన్‌ చాలా గ్యాప్‌ తర్వాత ‘గమనం’ సినిమాతో మళ్ళీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రియ ప్రధాన పాత్రలో నటించిన 'గమనం' సినిమా నిన్న.....

Shriya : సినిమా చూడటానికి ఆటోలో వచ్చిన శ్రియ

Shriya

Shriya :  ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా సరన్‌ చాలా గ్యాప్‌ తర్వాత ‘గమనం’ సినిమాతో మళ్ళీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రియ ప్రధాన పాత్రలో నటించిన ‘గమనం’ సినిమా నిన్న డిసెంబర్‌ 10న థియేటర్లో విడుదలైంది. శ్రియ, ప్రియాంక జువాల్కర్, శివ కందుకూరి, సుహాస్ లు మెయిన్ లీడ్స్ గా ఇందులో నటించారు. నాలుగైదు కథల సమాహారంతో ఈ సినిమాని లేడీ డైరెక్టర్ సుజనా రావు తెరకెక్కించారు.

Samantha : ‘పుష్ప’ ఐటెం సాంగ్‌లో సమంత అదరగొట్టే స్టిల్స్

నిన్న సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ కుకట్‌పల్లి లోని మల్లిఖార్జున థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. అయితే సినిమా చూడటానికి థియేటర్‌కు శ్రియా ఆటోలో వచ్చింది. స్టార్ హీరోయిన్ శ్రియ ఆటోలో రావడంతో అంతా షాక్ అయ్యారు. శ్రియ ఆటోలో రావడంతో ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. శ్రియ కూడా చిత్ర బృందం, ప్రేక్షకులతో కలిసి సినిమా చూసింది. శ్రియ రావడంతో ఆమెతో ఫోటోల కోసం థియేటర్ కి వచ్చిన జనం ఎగబడ్డారు.