మంచి పనికోసం-రెండొందలకే శ్రియతో డ్యాన్స్.. మిస్ అవకండి ఛాన్స్..

లాక్‌డౌన్ కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న నిరుపేద‌లు, కూలీలు, నిరాశ్ర‌య‌ల స‌హాయార్ధం హీరోయిన్ శ్రియ ముందుకొచ్చారు..

  • Published By: sekhar ,Published On : May 5, 2020 / 12:50 PM IST
మంచి పనికోసం-రెండొందలకే శ్రియతో డ్యాన్స్.. మిస్ అవకండి ఛాన్స్..

లాక్‌డౌన్ కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న నిరుపేద‌లు, కూలీలు, నిరాశ్ర‌య‌ల స‌హాయార్ధం హీరోయిన్ శ్రియ ముందుకొచ్చారు..

కోవిడ్ బాధితుల కోసం సీనియర్ యాక్ట్రెస్ శ్రియ శరణ్ తన వంతు సాయమందించడానికి ఓ సరికొత్త ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. లాక్‌డౌన్  కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న నిరుపేద‌లు, కూలీలు, నిరాశ్ర‌య‌ల స‌హాయార్ధం హీరోయిన్ శ్రియ  ముందుకొచ్చింది. ఇందుకోసం ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌తో క‌లిసి ప‌నిచేస్తున్న ఆమె.. వినూత్నంగా విరాళాలు సేక‌రిస్తోంది.

@thekindnessproject.in లో కేవ‌లం రూ. 200 రూపాయలు చెల్లించి రిసిప్ట్‌ను మెయిల్ చేసి వివ‌రాలు న‌మోదు చేసుకోవాల్సిందిగా కోరింది. మే 9 శ‌నివారం సాయంత్రం 8 గంట‌ల‌వ‌ర‌కు ఈ అవ‌కాశం ఉంద‌ని, ఆదివారం విజేత‌ల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొంది. లక్కీడ్రాలో విజేత‌లుగా నిలిచిన వారు (వీడియో కాల్ )లో త‌న‌తో క‌లిసి డ్యాన్స్, యోగా చేసే అవ‌కాశం సొంతం చేసుకోవ‌చ్చ‌ని అలాగే మీరిచ్చే విరాళాలన్నీ నిరుపేద‌ల‌కు చేరుతాయ‌ని, ఈ మంచి ప‌నిలో అంద‌రం భాగ‌స్వాములం అవుదాం అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా పిలుపునిచ్చింది శ్రియ.

View this post on Instagram

I Have teamed up with The Kindness Foundation and Chennai Task Force to help with their covid relief efforts They’re addressing those who are most vulnerable: destitute elderly, daily wage laborers, the homeless, orphans, and disabled – Will be offering two lucky winners a chance to dance, do some yoga, or whatever floats your boat to brighten up your quarantine – all you have to do to enter is donate Rs. 200 and email your receipt to give@thekindnessproject.in The contest will run until Saturday at 8pm, and winners will be contacted on Sunday You can swipe right for details or head to The Kindness Foundation page ???? let’s have some fun together and do some good too!

A post shared by Shriya Saran (@shriya_saran1109) on