Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్

సౌత్ బ్యూటీ శ్రుతి హాసన్ కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లోనూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో ఆమె చేసిన పలు.....

Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
ad

Shruti Haasan: సౌత్ బ్యూటీ శ్రుతి హాసన్ కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లోనూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో ఆమె చేసిన పలు సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలవడంతో, ఇక్కడ ఆమె స్టార్ హీరోయిన్ స్థాయిని కూడా అందుకుంది. అయితే తన బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ కారణంగా కొంత కాలం సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ, ఇప్పుడు తిరిగి సినిమాల్లో యమబిజీగా మారింది.

Shruti Haasan: సైజు అడిగిన నెటిజన్.. చురకలంటించిన శృతి!

టాలీవుడ్‌లో ప్రస్తుతం శ్రుతి హాసన్ పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ప్రభాస్‌తో కలిసి ‘సలార్’, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో శ్రుతి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే శ్రుతి హాసన్ ఇటీవల పోస్ట్ చేసిన ఓ వీడియోతో ఆమెకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. తన వర్కవుట్ వీడియోను షేర్ చేసి తనకున్న హార్మోనల్ ఇష్యూస్ గురించి చెప్పుకొస్తూ.. తాను మానసికంగా ఎంతో ధృడంగా ఉన్నా, ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిపింది. తనకు PCOS(రెగ్యులర్‌గా పీరియడ్స్ రాకపోవడం లేదా ఎక్కువ రోజులు పీరియడ్స్ అవుతూ ఉండడం) ఉందని.. ఇది చాలా మంది ఆడవారిలో వచ్చే సమస్య అంటూ శ్రుతి చెప్పుకొచ్చింది. హార్మోన్ బ్యాలెన్స్ తప్పడంతో PCOSతో బాధపడుతుంటారని ఆమె చెప్పుకొచ్చింది.

Shruti Haasan: సీనియర్స్ సూపర్ ఛాయిస్‌గా శృతిహాసన్

అయితే ఈ వార్తను పలు మీడియా ఛానళ్లు మరో విధంగా టెలికాస్ట్ చేశాయి. శ్రుతి హాసన్ ఆరోగ్యం బాగాలేదని, ఆసుపత్రిలో జాయిన్ అయ్యిందని మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా, ఈ విషయంపై శ్రుతి ఫ్యాన్స్ ఆందోళన చెందుతుండటంతో, తాజాగా ఈ అంశంపై శ్రుతి స్వయంగా క్లారిటీ ఇచ్చేసింది. తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. తాను చాలా బాగున్నానని, ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌లో బిజీగా ఉన్నానని శ్రుతి ఓ వీడియో పోస్ట్ చేసింది. తనకు PCOS అనేది చాలా ఏళ్లుగా ఉందని.. ఇదొక కామన్ ఇష్యూ అని.. దీన్ని మీడియాలో నెగెటివ్‌గా ప్రెజెంట్ చేశారని ఆమె క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి సోషల్ మీడియా, మీడియాలో శ్రుతి ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టేసింది ఈ బ్యూటీ.