Nani30 : నాని సినిమాలోకి శృతిహాసన్ ఎంట్రీ.. మరి మృణాల్ ఠాకూర్?

Nani30 సినిమాలోకి శృతిహాసన్ ఎంట్రీ ఇచ్చింది. ఈరోజు గోవా షూటింగ్‌లో శృతిహాసన్ పాల్గొంది. మరి మృణాల్ ఠాకూర్?

Nani30 : నాని సినిమాలోకి శృతిహాసన్ ఎంట్రీ.. మరి మృణాల్ ఠాకూర్?

Shruti Haasan entered into Nani30 sets but Mrunal Thakur

Nani30 : నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా దసరా (Dasara) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 115 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని నానిని 100 కోట్ల క్లబ్ లోకి తీసుకు వచ్చింది. ఇంతటి మాస్ కమర్షియల్ హిట్ తరువాత నాని ఒక ఎమోషనల్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యువ్‌ దర్శకత్వంలో నాని తన ల్యాండ్‌మార్క్ 30వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు.

Nani30: నాని మైల్‌స్టోన్ మూవీకి అలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తున్నారా..?

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ని ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీలోకి శృతిహాసన్ (Shruti Haasan) ఎంట్రీ ఇచ్చింది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ Nani30 లో కూడా అవకాశం అందుకుంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ఆమెను తీసుకున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. ఈరోజు (ఏప్రిల్ 29) గోవా షూటింగ్‌లో శృతిహాసన్ పాల్గొంది. ఈ షెడ్యూల్ చాలా లెంతీగా ఉండబోతున్నట్లు వెల్లడించారు. మూవీలోని ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొనున్నారు.

Shruti Haasan : శృతిహాసన్ పై ఫైర్ అవుతున్న టాలీవుడ్ ఆడియన్స్..

ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ మృణాల్ ఠాకూరే నటించనుంది. ఇక ఈ సినిమాలో నాని మరోసారి ఫాదర్ క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నాడు. గతంలో జెర్సీ సినిమాలో తండ్రి పాత్ర చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై ఈ చిత్రాన్ని చెరుకూరి మోహన్, డాక్టర్ విజయేందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ హృదయం మూవీకి సంగీతం అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.