‘ప్లాస్టిక్ సర్జరీ’ గురించి శృతి హాసన్ మనసు విప్పింది

  • Published By: sekhar ,Published On : July 29, 2020 / 03:17 PM IST
‘ప్లాస్టిక్ సర్జరీ’ గురించి శృతి హాసన్ మనసు విప్పింది

ప్రియుడితో లవ్, బ్రేకప్, అనారోగ్యం తర్వాత కొద్ది గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాల్లో సందడి చేయడానికి సిద్ధమైంది శ్రుతి హాసన్. ఇంతలో లాక్‌డౌన్ రావడంతో ఇంటి పట్టునే ఉంటూ వర్కౌట్స్‌‌తో పాటు తనకిష్టమైన మ్యూజిక్ కంపోజ్ చేస్తోంది.



ఆ మధ్య శ్రుతి లుక్ చూసి ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అంటూ రకరకాలుగా నెటిజన్స్ ట్రోల్ చేయడంతో తనపై వస్తున్న ట్రోల్స్ గురించి సోషల్ మీడియా ద్వారా స్పందించిన శ్రుతి హాసన్ తాజాగా మరోసారి ‘ప్లాస్టిక్ సర్జరీ’ అంశంపై మాట్లాడింది.

Shruti Haasan



‘నా మొదటి సినిమా టైంలో ముక్కు విరగడంతో సర్జరీ చేయించుకోవాలని డిసైడ్ అయ్యాను. నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా. దీని గురించి నేను ప్రచారం చేసుకోలేదు. మీరు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా? అని అడిగితే ఏ నటీ నిజం చెప్పదు. భారతీయ స్త్రీలు జుట్టుకి డై, స్కిన్‌కి బ్లీచ్, కళ్లకు కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకోవాలనుకుంటారు కదా ఇది కూడా అలాంటిదే. ఇతరుల అభిప్రాయాలకు అనుగుణంగా నేను ప్రవర్తించను. నేను ఎలా జీవించాలనుకుంటానో అలాగే జీవిస్తా. నన్ను నేను ఎప్పుడూ ప్రేమిస్తా.. నా జీవిత ప్రయాణం గురించి నిజాయితీ ఉండాలనిపించింది కాబట్టే నిజం చెప్పడానికి వెనకాడలేదు’ అని చెప్పుకొచ్చుంది.Shruti Haasan



హిందీలో కాజోల్‌తో కలిసి ‘దేవి’ అనే షార్ట్ ఫిల్మ్‌లో కనిపించిన శ్రుతి తెలుగులో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘గబ్బర్‌సింగ్, ‘కాటమరాయుడు’ తర్వాత వీళ్ల కలయికలో రానున్న మూడో సినిమా ఇది. అలాగే మాస్ మహారాజా రవితేజ పక్కన ‘క్రాక్’ సినిమాలోనూ నటిస్తోంది శృతి హాసన్.

https://www.instagram.com/p/B9EdFeNBj7v/?utm_source=ig_web_copy_link