Shruti Haasan: శ్రుతి హాసన్ ఫస్ట్ క్రష్.. ఎవరూ ఊహించని వ్యక్తి!
సౌత్ స్టార్ బ్యూటీ శ్రుతి హాసన్ తన ఫస్ట్ క్రష్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది. హాలీవుడ్ నటుడు బ్రూస్‌లీ తన ఫస్ట్ క్రష్ అంటూ చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్.

Shruti Haasan Reveals Her First Crush
Shruti Haasan: సౌత్ స్టార్ బ్యూటీ శ్రుతి హాసన్ తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇటీవల సంక్రాంతి బరిలో అమ్మడు ఏకంగా రెండు తెలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి సరసన ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి బాలకృష్ణ సరసన ‘వీరసింహారెడ్డి’లో శ్రుతి హాసన్ నటించింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. దీంతో శ్రుతి మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
Shruti Haasan: సలార్ షూటింగ్‌లో తిరిగి జాయన్ అయిన శ్రుతి హాసన్
ఇక ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘సలార్’ మూవీలో నటిస్తోంది ఈ బ్యూటీ. అటు వ్యక్తిగత జీవితంలో తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి తరుచూ కనిపిస్తుంది ఈ స్టార్ బ్యూటీ. అయితే తాజాగా తన ఫస్ట్ క్రష్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది శ్రుతి. తన ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. హాలీవుడ్ నటుడు బ్రూస్‌లీ తన ఫస్ట్ క్రష్ అంటూ చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్. ఆయన సినిమాలు చూస్తున్నంతసేపు బ్రూస్‌లీని అదే పనిగా చూసేదట. ఆయనంటే తనకు ఎంతో ఇష్టమని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.
Shruti Haasan : తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టిన శృతిహాసన్..
ఇలా హాలీవుడ్ నటుడు బ్రూస్‌లీ పై తన అభిమానాన్ని తెలిపిన శ్రుతి హాసన్‌ను ఆమె అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఏదైనా విషయాన్ని నిర్భయంగా చెప్పుకొచ్చే శ్రుతి ఇలా తన ఫస్ట్ క్రష్ ఎవరో కూడా చెప్పి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుందని వారు కితాబిస్తున్నారు. ఇక సలార్ మూవీలో ఆద్య అనే పాత్రలో నటిస్తోంది ఈ బ్యూటీ.