అంతా బ్రాంతియేనా : విడిపోయిన ప్రేమ పక్షులు

శృతి హాసన్, మైఖెల్ కోర్సెల్‌ జంటని చూసి, త్వరలో వీళ్ళిద్దరూ పెళ్ళి పీటలెక్కబోతున్నారు అనుకున్నారందరూ.. కట్ చేస్తే, వీరి బంధం ఇప్పుడు బ్రేకప్ అయ్యింది..

  • Published By: sekhar ,Published On : April 26, 2019 / 07:17 AM IST
అంతా బ్రాంతియేనా : విడిపోయిన ప్రేమ పక్షులు

శృతి హాసన్, మైఖెల్ కోర్సెల్‌ జంటని చూసి, త్వరలో వీళ్ళిద్దరూ పెళ్ళి పీటలెక్కబోతున్నారు అనుకున్నారందరూ.. కట్ చేస్తే, వీరి బంధం ఇప్పుడు బ్రేకప్ అయ్యింది..

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ పెద్ద కూతురు, హీరోయిన్ కమ్ సింగర్ శృతి హాసన్.. గతకొద్ది రోజులుగా లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్, మైఖెల్ కోర్సెల్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.. సినిమాలు కూడా పక్కన పెట్టేసి, మైఖెల్ ప్రేమలో మునిగితేలుతూ, అతగాడితో సహజీవనం చేస్తూ, పబ్లిక్‌గానే చెట్టాపట్టాలేసుకు తిరిగింది.
Also Read : నర్సు ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు : ఆదుకోవాలని KCRకు లేఖ

తను లండన్‌లో మైఖెల్‌తో కలిసి ఉండడమే కాక, అతగాణ్ణి చెన్నై తీసుకొచ్చి నాన్నకి పరిచయం చేసింది కూడా.. కమల్ హాసన్ విశ్వరూపం-2లో మైఖెల్ రష్యన్ సోల్జర్‌గా నటించాడు.. ఈ జంటని చూసి, త్వరలో వీళ్ళిద్దరూ పెళ్ళి పీటలెక్కబోతున్నారు అనుకున్నారందరూ.. కట్ చేస్తే, వీరి బంధం ఇప్పుడు బ్రేకప్ అయ్యింది. తమ ప్రేమాయణానికి ప్యాకప్ చెప్తున్నట్టు మైఖెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు.

‘జీవితం మా ఇద్దరినీ ఆపోజిట్ మార్గాలలో ఉంచింది. దురదృష్టవశాత్తు మేమిద్దరం ఒంటరి మార్గాల్లో నడవాల్సి వస్తుంది. బట్, ఈ యంగ్ లేడీ ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్‌గానే మిగిలిపోతుంది.. తనకి లైఫ్ లాంగ్ ఓ ఫ్రెండ్‌గా ఉండిపోతున్నందుకు చాలా ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను’.. అంటూ శృతి హాసన్‌తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసాడు మైఖెల్.. వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలూ లేవు, ఇద్దరూ డిస్కస్ చేసుకుని, ఫ్రెండ్లీగానే విడిపోయారు అని తెలుస్తుంది.. గతంలోనూ శృతికి, హీరో సిద్ధార్థ్‌తో బ్రేకప్ అయ్యింది. మైఖెల్‌తో బ్రేకప్ విషయంపై శృతి హాసన్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.
Also Read : లంక తగలబడుతోంది : 39 దేశాలకు వీసాల జారీ నిలిపివేసిన శ్రీలంక