Shweta Tiwari : లో దుస్తులపై కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన శ్వేతా తివారీ

నటి శ్వేతా తివారీ బోల్డ్ కామెంట్స్ రచ్చ రచ్చ అవుతున్నాయి. నెటిజన్లు మండిపడుతున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉందా ? హిందూ దేవుళ్లను కించపరిచేలా ఉన్నాయంటూ తీవ్రస్థాయిలో...

Shweta Tiwari : లో దుస్తులపై కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన శ్వేతా తివారీ

Untitled 12

Shweta Tiwari Issues Apology : శ్వేతా తివారీ.. ఈమె సినీ నటే కాకుండా.. బుల్లితెరపై నటిస్తోంది. ఈమెకు ఎంతో మంది అభిమానులున్నారు. కానీ.. ప్రస్తుతం ఈమె చేసిన బోల్డ్ కామెంట్స్ రచ్చ రచ్చ అవుతున్నాయి. నెటిజన్లు మండిపడుతున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉందా ? హిందూ దేవుళ్లను కించపరిచేలా ఉన్నాయంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో సోషల్ మీడియాలో ఈమెకు సంబంధించిన ఆ వార్త హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్ర రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనపై విచారణ జరిపి 24 గంటల్లోగా నివేదిక అందచేయాలని ఆదేశించారు. అంటే.. నటి శ్వేతా తివారీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో అర్థం చేసుకోవచ్చు.

Read More : Punjab AAP CM : ఏడేళ్లుగా ఎంపీ.. అయినా అద్దింట్లోనే, నిజాయితీ సీఎం రావడం అవసరం

అసలు ఏం జరిగింది ?
శ్వేతా తివారీ…ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఆమె బుధవారం భోపాల్ కు వచ్చారు. అక్కడ మీడియా సమావేశం ఏర్పాటులో పాల్గొన్నారు. తన లో దుస్తుల విషయంలో వివాదానికి ఆజ్యం పోశారు. తన లో దుస్తుల సైజు దేవుడే తీసుకుంటున్నాడంటూ బోల్డ్ గా కామెంట్స్ చేయడం అగ్గిరాజేసింది. దీనికి సంబంధించిన వీడియోలు క్షణాల్లో సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఇంకేముంది.. వీడియోలు వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసినందుకు గాను వెంటనే క్షమాపణలు చెప్పాలనే డిమాండ్స్ వినిపించాయి. ఈ విషయంలో కేసు కూడా నమోదు కావడంతో శ్వేత తివారీ మౌనం వీడాల్సి వచ్చింది.

Read More : Kushboo Sundar : యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతున్న ఖుష్బూ..

ప్రజల మనోభావాలు దెబ్బతీసినందుకు గాను క్షమాపణలు చెబుతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. భగవంతుడిని తాను విశ్వసిస్తానని, తెలిసీతెలియకుండా తాను అలాంటి పనులు చేయనని చెప్పుకొచ్చారు. తన మాటలతో ఎవరినీ బాధ పెట్టాలనే ఉద్దేశ్యం తనకు లేదని వెల్లడించారామె. తాను చేసిన వ్యాఖ్యలు చాలా మందికి అనుకోకుండా బాధ కలిగించడంపై క్షమాపణలు కోరుతున్నట్లు శ్వేతా తివారీ పేర్కొన్నారు. దీంతో దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా ? లేదా ? అనేది చూడాలి.