Shyam Singha Roy: ఓటీటీలో శ్యామ్ సింగరాయ్.. ఎప్పుడంటే?

హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా, రిజల్ట్ ని ఏమాత్రం పట్టించుకోకుండా ఓటీటీలు నాని సినిమా అంటే జై అంటున్నాయి. శ్యామ్ సింగరాయ్ సినిమాకి రెండు సినిమాలు ఓటీటీలో విడుదలై ప్లాప్ టాక్..

Shyam Singha Roy: ఓటీటీలో శ్యామ్ సింగరాయ్.. ఎప్పుడంటే?

Shyam Singha Roy

Shyam Singha Roy: హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా, రిజల్ట్ ని ఏమాత్రం పట్టించుకోకుండా ఓటీటీలు నాని సినిమా అంటే జై అంటున్నాయి. శ్యామ్ సింగరాయ్ సినిమాకి రెండు సినిమాలు ఓటీటీలో విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకున్నా శ్యామ్ సింగరాయ్ కోసం విశ్వప్రయత్నాలు చేశాయి ఓటీటీలు. అలాంటిది థియేటర్లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాను ఓటీటీలు వదిలిపెడతాయా? శ్యామ్ సింగరాయ్ సినిమా కోసం రెండు సంస్థల మధ్య పోటీ నెలకొనగా ఫైనల్ గా భారీ ధర చెల్లించి నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

Film Celebrities: సెలబ్రిటీలను చుట్టేస్తున్న కరోనా.. ఉదృతంగా వ్యాప్తి!

నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. రాహుల్ సంకృత్యాన్ కలకత్తా నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించగా.. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైన మూవీ హిట్‌టాక్ తెచ్చుకోగా కమర్షియల్‌గా కూడా మంచి కలెక్షన్స్‌ రాబడుతోంది. కాగా.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కి రానుంది.

Allu Arjun : ‘పుష్ప’ సినిమా.. థియేటర్లో ఒక ప్రింట్.. ఓటీటీలో మరో ప్రింట్

థియేటర్లో రిలీజ్‌ అయి భారీ సక్సెస్ అందుకున్న ఈమూవీని నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ రిలీజ్‌ రైట్స్‌ను సొంతం చేసుకోగా జనవరి 21న స్ట్రీమింగ్ కి తీసుకురానున్నారట. ఈ మూవీ విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేసుకోవాలని ముందే ఒప్పందం చేసుకోగా.. రెండు రోజుల ముందే ప్రసారం చేయనున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. సంక్రాంతి హడావుడి తగ్గిన తర్వాత వచ్చే వీకెండ్ ను శ్యామ్ సింగరాయ్ క్యాష్ చేసుకొనే ఆలోచనలోనే ఈ రిలీజ్ ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తుంది.