Shyam Singha Roy: నాని కోసం రాసిన కథ కాదు.. రిజక్ట్ చేసిన హీరో ఎవరంటే?

నేచురల్ స్టార్ నాని త్వరలోనే ‘శ్యామ్ సింగ రాయ్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో..

Shyam Singha Roy: నాని కోసం రాసిన కథ కాదు.. రిజక్ట్ చేసిన హీరో ఎవరంటే?

Shyam

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని త్వరలోనే ‘శ్యామ్ సింగ రాయ్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో నటించనుండగా.. నాని సరసన సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి కథానాయకులుగా నటిస్తున్నారు. 1970 కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్‏లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా రూపొందించగా అదేస్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Ashu Reddy: పాపం అషూ పాప ఆశ తీరేదెప్పుడో?!

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టిన యూనిట్ డిసెంబర్ 24న ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సినిమా నానీ కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ సినిమాగా మారనుందని ధీమాగా ఉన్నారు. కాగా, ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ ఒకటి సాగుతుంది. ఈ సినిమా కథను రచయిత జంగా సత్యదేవ్ నిజానికి నానీ కోసం రాసుకోలేదని రానా దగ్గుబాటిని దృష్టిలో పెట్టుకొని రాసుకున్నాడని.. అయితే రానా ఈ కథను సున్నితంగా తిరస్కరించడంతో నానీ వద్దకు వెళ్లిందని చెప్తున్నారు.

Anjini Dhawan: టీజింగ్ చూపులతో లేత సోకుల అంజనీ!

ముందుగా శ్యామ్ సింగరాయ్ కథతో రానా వద్దకు వెళ్లిన దర్శక, నిర్మాతలకి తనకంటే నానీకి అయితే ఈ కథ బాగా సూటవుతుందని సూచించాడట. గతంలో ఇలా ఎన్నో కథలు ఒక హీరోను దృష్టిలో పెట్టుకొని రాసుకొని.. పలు మార్పులు చేర్పులు చేసుకొని చివరికి మరో హీరో నటించి భారీ సక్సెస్ కొట్టారు. మరి శ్యామ్ సింగరాయ్ సినిమాలో రానా కోసం రాసిన కథకు నానీ కోసం ఏమైనా మార్పులు చేసారా.. గతంలో ఇలా మారిన హీరోల సినిమాల మాదిరే ఈ సినిమా ఫలితం ఉంటుందా అన్నది చూడాల్సి ఉంది.