Ishq Video Song: సిద్ శ్రీరామ్ పాట.. అందంగా.. హాయిగా!

ప్రియురాలిని పొగడాలంటే కాస్త కళ కావాలి. ఆ పొగడ్త అందరికీ చేత కాదు. ఇక పాటలో స్త్రీని పొగడాలంటే అందరి గొంతు అందుకు నప్పదు. అయితే, స్త్రీలను పొగిడే ఒక గొంతు కొన్నాళ్లుగా తెలుగులో తళతళలాడుతోంది. కొంత అరవం కొంత తెలుగు కలగలిసిన ఆ శబ్దానికి హీరోయిన్లే కాదు ప్రేక్షకులూ ఫిదా అవుతున్నారు.

Ishq Video Song: సిద్ శ్రీరామ్ పాట.. అందంగా.. హాయిగా!

Ishq

Ishq Video Song: ప్రియురాలిని పొగడాలంటే కాస్త కళ కావాలి. ఆ పొగడ్త అందరికీ చేత కాదు. ఇక పాటలో స్త్రీని పొగడాలంటే అందరి గొంతు అందుకు నప్పదు. అయితే, స్త్రీలను పొగిడే ఒక గొంతు కొన్నాళ్లుగా తెలుగులో తళతళలాడుతోంది. కొంత అరవం కొంత తెలుగు కలగలిసిన ఆ శబ్దానికి హీరోయిన్లే కాదు ప్రేక్షకులూ ఫిదా అవుతున్నారు. ప్రేక్షకుల మనోభావాన్ని అర్ధం చేసుకొని మేకర్స్ కూడా సిద్ శ్రీరామ్ లేకుండా యూత్ ఫుల్ సినిమాకు సిద్ధపడడం లేదు.

ముఖ్యంగా హీరో హీరోయిన్ మీద ప్రేమను చెప్పడానికి, ప్రేమలో లోతును చెప్పడానికి సిద్‌ శ్రీరామ్‌ గొంతు బాగా నప్పుతుంది. అలా ప్రియురాలిని కీర్తిస్తూ శ్రీరామ్ పాడిన ఓ పాట ఇప్పుడు ప్రేక్షకుల బాగా ఆకట్టుకుంటుంది. జాంబీరెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జా, కన్నుగీటుతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రియా ప్రకాష్‌ వారియర్‌ జంటగా ఎస్ఎస్‌ రాజు దర్శకత్వంలో ‘ఇష్క్’ సినిమా తెరకెక్కింది.

ఇప్పటికే ఈ సినిమాలో ఆనందం మదికే సాంగ్ ఆడియో పరంగా బిగ్గెస్ట్ హిట్ అయింది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట వినడానికి ఫీల్ గుడ్ లవ్ సాంగ్ తో హాయిగా ఉండడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా యూనిట్ ఈ పాట క్రేజ్ ను సినిమా ప్రమోషన్ కు వాడుకునేందుకు ఈ పాట వీడియో సాంగ్ కూడా శనివారం విడుదల చేశారు. విజువల్ పరంగా కూడా ఈ పాట అందంగా ఉండడంతో యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

ఈ పాటను సిద్ శ్రీరామ్‌ ఆలపించగా, శ్రీమణి సాహిత్యాన్ని అందించాడు. ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌లు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30వ తేదిన థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. మరి ఈ పాట సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాల్సిఉంది.