Siddarth Anand : షారుఖ్ సినిమా ఫ్లాప్ అయితే అది డైరెక్టర్ తప్పే.. పఠాన్ డైరెక్టర్ కామెంట్స్..

తాజాగా ఓ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రతి ఫిల్మ్ మేకర్ షారుఖ్ తో సినిమా చేయాలని కలలు కంటాడు. అతనితో కలిసి పని చేసే అవకాశం నాకు లభించింది. షారుఖ్ ఖాన్‌ని దర్శకత్వం వహించడం ఒక బాధ్యత. ప్రతి సినిమాకి ముందు.................

Siddarth Anand : షారుఖ్ సినిమా ఫ్లాప్ అయితే అది డైరెక్టర్ తప్పే.. పఠాన్ డైరెక్టర్ కామెంట్స్..

Siddarth Anand :  షారుఖ్ ఖాన్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్ గా, జాన్ అబ్రహం విలన్ గా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా ఇటీవల జనవరి 25న థియేటర్స్ లో రిలీజయి భారీ విజయం సాధించింది. నాలుగేళ్ల తర్వాత షారుఖ్ తెరపై కనిపిస్తుండటంతో అభిమానులు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. పఠాన్ సినిమా మొదటి నుంచి కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులు సెట్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ఆరు రోజుల్లో 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాదాపు 300 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులు సెట్ చేస్తుంది.

షారుఖ్ దాదాపు 7 ఏళ్లుగా హిట్ చూడలేదు, నాలుగేళ్లుగా సినిమా రిలీజ్ చేయలేదు. షారుఖ్ గత సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఇప్పుడు పఠాన్ పెద్ద హిట్ అవ్వడంతో అభిమానులతో పాటు బాలీవుడ్ కూడా సంతోషిస్తున్నారు. అయితే షారుఖ్ ఫ్లాప్ సినిమాలపై పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Alia Bhatt : బ్రహ్మాస్త్ర కలెక్షన్స్ బ్రేక్ చేసిన పఠాన్.. అలియా ఏముందో తెలుసా?

తాజాగా ఓ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రతి ఫిల్మ్ మేకర్ షారుఖ్ తో సినిమా చేయాలని కలలు కంటాడు. అతనితో కలిసి పని చేసే అవకాశం నాకు లభించింది. షారుఖ్ ఖాన్‌ని దర్శకత్వం వహించడం ఒక బాధ్యత. ప్రతి సినిమాకి ముందు ఉండే టెన్షన్ కన్నా పఠాన్ కి ఇంకా ఎక్కువ ఉంది. షారుఖ్ మట్టి లాంటివాడు. మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. షారుఖ్ దర్శకుడిని మాత్రమే నమ్ముతాడు. దర్శకుడు ఏది చెప్తే అది, ఎలా చెప్తే అలా చేస్తాడు. ఈ సినిమాకి పనిచేస్తున్నప్పుడు షారుఖ్ ని మరింత దగ్గరగా చూశాను. అందుకే ఒకవేళ షారుఖ్ సినిమా ఫ్లాప్ అయితే అది దర్శకుడి తప్పు మాత్రమే. ఎందుకంటే దర్శకుడు అడిగిన ప్రతీది షారుఖ్ ఇస్తాడు అని తెలిపాడు. దీంతో ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో వైరల్ గా మారాయి.