Siddarth : పాన్ ఇండియా అనేది ఒక నాన్సెన్స్.. హీరో సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు..

హీరో సిద్దార్థ్ అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. తాజాగా పాన్ ఇండియా సినిమా నాన్సెన్స్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో సిద్దార్థ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''ఇక్కడ చేసేవి అన్ని భారతీయ సినిమాలే...............

Siddarth : పాన్ ఇండియా అనేది ఒక నాన్సెన్స్.. హీరో సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు..

Siddarth

Pan India Movies :  ఇటీవల కాలంలో మన సౌత్ సినిమాలన్నీ దేశమంతటా భారీ విజయం సాధిస్తుండటంతో పాన్ ఇండియా సినిమా అంటూ ప్రమోట్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో కూడా భారీ విజయాలు సాధిస్తుండటంతో పాన్ ఇండియా సినిమా అనే పదం మరింత వైరల్ అవుతుంది. దీంతో సౌత్, నార్త్ సినిమా అంటూ సోషల్ మీడియాలో మాటల యుద్ధం కూడా జరుగుతుంది. వీటిపై ఒక్కో సెలబ్రిటీ ఒక్కోలా స్పందిస్తున్నారు. సౌత్ హీరోలు గర్వంగా స్పందిస్తుంటే, బాలీవుడ్ హీరోలు మాత్రం వారి సినిమాలు వరుస పరాజయం పాలవ్వడం, మన సినిమాలు అక్కడ ఆడటంతో అసహనానికి గురవుతున్నారు. తాజాగా ఈ పాన్ ఇండియా సినిమా అనే దానిపై హీరో సిద్దార్థ్ స్పందించారు.

Sarkaru Vaari Paata : ఇలాంటి కథ ఇప్పట్లో రాదు.. సర్కారు వారి పాట సినిమాపై అనంత శ్రీరామ్

హీరో సిద్దార్థ్ అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. తాజాగా పాన్ ఇండియా సినిమా నాన్సెన్స్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో సిద్దార్థ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”ఇక్కడ చేసేవి అన్ని భారతీయ సినిమాలే అయినప్పుడు పాన్‌ ఇండియా అని ఎందుకంటున్నారు?. పాన్ ఇండియా సినిమా అనే పదమే ఒక నాన్సెన్స్. కొన్ని సంవత్సరాల క్రితమే రోజా అనే పాన్‌ ఇండియా సినిమా వచ్చింది కదా. మణిరత్నం డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాను దేశం మొత్తం ప్రతి ఒక్కరూ చూశారు. గతంలోనే ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. సినిమాను నచ్చిన భాషలో చూసే హక్కు ప్రేక్షకులకు ఉంది. అందుకే పాన్‌ ఇండియా అనే పదం తీసేసి ఇండియన్‌ సినిమా అని పెట్టండి. ఒక సినిమా గొప్పగా రావాలంటే ఎంతోమంది టెక్నీషయన్లు కష్టపడతారు. వారికి భాషా భేదం ఉండదు. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా, ఏ భాషలో అయినా కచ్చితంగా హిట్ అవుతుంది. దానికి పాన్ ఇండియా సినిమా అని బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు” అంటూ స్పందించాడు. దీంతో సిద్దార్థ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీనిపై ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.