Siddharth-Aditi : మరోసారి ప్రేమ జంట వైరల్.. ట్రెండింగ్ సాంగ్‌కి కలిసి రీల్ చేసిన సిద్దార్థ్-అదితి
ఇటీవల సోషల్ మీడియాలో విశాల్ హీరోగా నటించిన ఎనిమీ సినిమాలోని మాల టంటం..మంజర టంటం.. అనే పాట రీల్స్ రూపంలో ట్రెండింగ్ అవుతుంది. దీంతో సిద్దార్థ్-అదితి కూడా ఈ పాటకు సరదాగా స్టెప్పులు వేసి ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి....................

Siddharth and Aditi rao Hydari dance for a trending song and it goes viral
Siddharth-Aditi : హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు, డేటింగ్ లో ఉన్నారు అని వార్తలు వస్తూనే ఉన్నాయి. ముంబై వీధుల్లో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. కలిసి డిన్నర్స, లంచ్, పార్టీలకు వెళ్తూనే ఉన్నారు. ఇటీవల శర్వానంద్ నిశ్చితార్థానికి కూడా కలిసే వచ్చారు ఈ జంట. దీంతో వీరిద్దరి ప్రేమ వార్తలకు మరింత బలం చేకూరింది.
మహా సముద్రం సినిమాలో అదితి, సిద్దార్థ్ కలిసి నటించారు. అంతకుముందే వీరిద్దరికి పరిచయం ఉన్నా ఆ సినిమా తర్వాత మంచి ఫ్రెండ్స్ గా మారారు. ఇప్పుడు ప్రేమలో ఉన్నారని అంతా అనుకుంటున్నారు. వీరి సన్నిహితులు కూడా అదే అంటున్నారు. వీరిద్దరూ కలిసి ఎప్పుడు కనపడినా ఈ జంట వైరల్ అవుతూనే ఉంది. ఈ సారి ఏకంగా ఓ ట్రెండింగ్ సాంగ్ కి రీల్ చేసి వైరల్ అవుతున్నారు.
ఇటీవల సోషల్ మీడియాలో విశాల్ హీరోగా నటించిన ఎనిమీ సినిమాలోని మాల టంటం..మంజర టంటం.. అనే పాట రీల్స్ రూపంలో ట్రెండింగ్ అవుతుంది. దీంతో సిద్దార్థ్-అదితి కూడా ఈ పాటకు సరదాగా స్టెప్పులు వేసి ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి.. డ్యాన్స్ మంకీస్… రీల్ డీల్ అని పోస్ట్ చేశారు. దీంతో సిద్దార్థ్-అదితి కలిసి వేసిన ఈ స్టెప్పులు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే ఈ వీడియో ఎవరింట్లో చేశారు? ఎవరింటికి ఎవరు వెళ్లారు? అని నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. మరోసారి వీళ్ళ ప్రేమ వైరల్ గా మారింది.