Siddharth : పాటలతో స్టేజిపై అదరగొట్టిన సిద్దార్థ్.. బొమ్మరిల్లు 2 అనౌన్సమెంట్?
తాజాగా టక్కర్(Takkar) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగింది. ఈ ఈవెంట్ లో సిద్దార్థ్ స్టేజిపై తన సినిమాల్లోని పాటలతో అలరించారు. దాదాపు 10 నిమిషాలపాటు వివిధ సినిమాల్లోని తన పాటలను పాడి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాడు.

Siddharth and Bommarillu Bhaskar announced Bommarillu 2 Movie at Takkar Pre Release Event
Siddharth : హీరో సిద్దార్థ్ బొమ్మరిల్లు(Bommarillu), నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఓయ్, ఓ మై ఫ్రెండ్.. లాంటి పలు సినిమాలతో తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు. అవే కాక పలు డబ్బింగ్ సినిమాలతో కూడా తెలుగులో మంచి స్థానం సంపాదించాడు. సిద్ధార్థ్ 40 ఏళ్ళు దాటుతున్నా ఇంకా కుర్రాడిలానే కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. సిద్దార్థ్, దివ్యంషా కౌశిక్(Divyansha Kaushik) జంటగా నటించిన టక్కర్ సినిమా జూన్ 9న రిలీజ్ కాబోతుంది.
తాజాగా టక్కర్(Takkar) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగింది. ఈ ఈవెంట్ లో సిద్దార్థ్ స్టేజిపై తన సినిమాల్లోని పాటలతో అలరించారు. దాదాపు 10 నిమిషాలపాటు వివిధ సినిమాల్లోని తన పాటలను పాడి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాడు. దీంతో సిద్దార్థ్ పాటలు పాడిన వీడియో వైరల్ గా మారింది.
ఇక ఈ ఈవెంట్ కు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా విచ్చేశారు. సిద్ధార్థ్ మాట్లాడుతూ.. చాలా ఏళ్ళ తర్వాత భాస్కర్ ని కలిశాను. బొమ్మరిల్లు షూటింగ్ నిన్న మొన్నే జరిగినట్టు అనిపిస్తుంది. ఆ సినిమాతో నాకు మంచి మెమరీస్ ఉన్నాయి. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమా ఇచ్చారు భాస్కర్. బొమ్మరిల్లు 2 సినిమా ఎప్పుడు చేద్దాం అని అన్నారు. అలాగే బొమ్మరిల్లు సినిమాలోని డైలాగ్స్ చెప్పి మెప్పించారు.
ఇక ఇదే ఈవెంట్ లో భాస్కర్ మాట్లాడుతూ బొమ్మరిల్లు సినిమా రీ రిలీజ్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. బొమ్మరిల్లు 2 ప్లాన్ చేస్తాను అని అన్నారు. దీంతో సిద్దార్థ్ అభిమానులు, బొమ్మరిల్లు సినిమా ఫ్యాన్స్ బొమ్మరిల్లు సీక్వెల్ త్వరగా వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నారు.