Siddharth : భారతీయుడు 2 సినిమాపై సిద్దార్థ్ కామెంట్స్.. ఆ పాత్రలో నటిస్తున్నాడట..

సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా నటించిన టక్కర్ సినిమా జూన్ 9న రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు సిద్దార్థ్. తాజాగా హీరో సిద్దార్థ్(Siddharth) భారతీయుడు 2 సినిమా గురించి మాట్లాడాడు.

Siddharth : భారతీయుడు 2 సినిమాపై సిద్దార్థ్ కామెంట్స్.. ఆ పాత్రలో నటిస్తున్నాడట..

Siddharth comments on Kamal Haasan Indian 2 Movie

Indian 2 :  కమల్ హాసన్(Kamal Haasan) ఒకప్పటి సూపర్ హిట్ సినిమా భారతీయుడుకి ఇటీవల సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శంకర్(Shankar) దర్శకత్వంలో భారతీయుడు 2(Bharateeyudu 2) సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సిద్దార్థ్, బాబీ సింహ, సముద్రఖని.. ఇలా పలువురు స్టార్ యాక్టర్స్ చాలా మంది నటిస్తున్నారు. తాజాగా హీరో సిద్దార్థ్(Siddharth) భారతీయుడు 2 సినిమా గురించి మాట్లాడాడు.

సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా నటించిన టక్కర్ సినిమా జూన్ 9న రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు సిద్దార్థ్. తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ఇండియన్ 2 సినిమా కచ్చితంగా చూడాల్సిన సినిమా. అది ఏ భాషలో రిలీజయినా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాలో పనిచేయడం నేను ఆశీర్వాదంగా భావిస్తున్నాను. నన్ను హీరోగా లాంచ్ చేసిన డైరెక్టర్ మళ్ళీ ఇన్నేళ్లకు నన్ను పిలిచి అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. అది కూడా కమల్ హాసన్ తో కలిసి పనిచేయడం మరింత ఆనందించే విషయం. నన్ను మళ్ళీ పిలిచి ఈప్రాజెక్టు లో ఛాన్స్ ఇచ్చినందుకు శంకర్ సర్ కి ఎప్పటికి కృతజ్ఞతలు తెలుపుతాను. కమల్ సర్ పై ఉన్న ఇష్టమే నన్ను నటుడిని చేసింది. ఆయన్ని కలిసిన ప్రతిసారి చాలా ఆనందంగా ఫీల్ అయ్యేవాడిని, ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేస్తున్నాను, నేను చాలా అదృష్టవంతుడిని అని అన్నారు.

OTT : ఓటీటీలకు షాక్ ఇచ్చిన కేంద్రం.. ఇకపై ఓటీటీ సినిమాలకు కూడా ఆ యాడ్స్ ఉండాల్సిందే..

భారతీయుడు 2 సినిమాలో సిద్దార్థ్ కమల్ హాసన్ కి మనవడిలా కనిపిస్తాడని సమాచారం. భారతీయుడు సినిమాలో పాత్ర ఎక్కడ ఎండ్ అవుతుందో తిరిగి అదే ముసలివాడు పాత్రలో కమల్ కనిపిస్తారని సమాచారం. ఈ పాత్ర కోసం కమల్ చాలా కఠినమైన డైట్ ఫాలో అవుతున్నారట. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ చేస్తారని భావిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.