Siddhu Jonnalagadda : సుకుమార్ రైటింగ్స్‌లో డీజే టిల్లు కొత్త మూవీ..

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌. గత ఏడాది వచ్చిన డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ ని సంపాదించుకున్నాడు. కాగా నేడు (ఫిబ్రవరి 7) సిద్దు పుట్టినరోజు. దీంతో తన కొత్త సినిమాని ప్రకటించాడు ఈ యంగ్ హీరో. స్టార్ డైరెక్టర్ సుకుమార్...

Siddhu Jonnalagadda : సుకుమార్ రైటింగ్స్‌లో డీజే టిల్లు కొత్త మూవీ..

Siddhu Jonnalagadda

Siddhu Jonnalagadda : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఆ తరువాత LBW సినిమాతో హీరోగా పరిచయమైన సిద్దు.. గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాథ వినుమా సినిమాలు చేస్తూ వచ్చాడు. నటుడు గానే కాదు ఈ సినిమాలకు సిద్దు రైటర్ గా కూడా పని చేశాడు. ఇక గత ఏడాది వచ్చిన డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ ని సంపాదించుకున్నాడు. ఆ మూవీలో సిద్దు బాడీ లాంగ్వేజ్ అండ్ స్లాంగ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. డీజే టిల్లుకి కూడా సిద్దునే రైటర్ గా చేశాడు.

Siddhu Jonnalagadda : విజయ్ దేవరకొండ, అడవి శేష్‌కి వచ్చినట్టు నాకు ఛాన్సులు రాలేదు

కాగా నేడు (ఫిబ్రవరి 7) సిద్దు పుట్టినరోజు. దీంతో తన కొత్త సినిమాని ప్రకటించాడు ఈ యంగ్ హీరో. స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాణంలో ఈ మూవీ ఉండబోతుంది. సుకుమార్ రైటింగ్స్ తో కలిసి బివిఎస్‌ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ వీరిద్దరూ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష. ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ కోసం మరోసారి ఈ రెండు నిర్మాణ సంస్థలు కలిసి పని చేస్తున్నట్లు ప్రకటించాడు బివిఎస్‌ఎన్.

ఇక ఈ సినిమాకి సుకుమార్ కథని అందిస్తున్నాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీని కొత్త దర్శకురాలు వైష్ణవి డైరెక్ట్ చేస్తుంది. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రాబోతున్నట్లు తెలియజేశారు నిర్మాతలు. సిద్దు 8వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. ప్రస్తుతం సిద్దు డీజే టిల్లు సీక్వెల్ లో నటిస్తున్నాడు.